కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు అత్యున్నత అవార్డు దక్కింది. ప్రఖ్యాత స్కోచ్ సంస్థ ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం లభించింది. దేశంలో పేదరిక నిర్మూలన కోసం వెంకయ్యనాయుడు చేస్తున్న కృషికి మెచ్చే జీవిత సాఫల్య పురస్కారం అందజేసినట్లు స్కోచ్ ప్రతినిధులు తెలిపారు. స్కోచ్ సంస్థ ప్రకటించిన పురస్కారాన్ని అందుకునే కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
ఇదిలాఉండగా ఇదే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కు సైతం స్కోచ్ సంస్థ అవార్డు అందజేసింది. ఆయనకు చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చింది. ఐటీ రంగంలో కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది.