గ్రేటర్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరుకుంది. ప్రచారం ముగియటానికి కొద్ది గంటల ముందు పలువురు అగ్రనేతలు ప్రచారబరిలోకి దిగారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ లో ఉన్న హైదరాబాదీయుల్లో ఎవరూ సెటిలర్లు కాదని తేల్చారు. హైదరాబాద్ లోని అందరూ భారతీయులేనని స్పష్టం చేశారు.
ఇక.. ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్ని పాకిస్థాన్ కో.. బంగ్లాదేశ్ కో ఇవ్వలేదని.. విభజనలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన వెంకయ్య.. ప్రతిపక్షాల రాజకీయాలతో రోహిత్ ఆత్మ బాధ పడుతుందని వ్యాఖ్యానించారు. సమాజంలోదళితులు.. దళితేతరులు అంటూ చర్చ తీసుకురావటం దారుణమని అభిప్రాయపడ్డారు.
ఐసిస్ సానుభూతిపరులు తమపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందంటూ మండిపడిన వెంకయ్య.. మోడీ సర్కారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు.