వెంకయ్యకు మెమరీ లాస్ ఉందా?

Update: 2015-07-22 06:26 GMT
ఏపీకి ఎవరో చేసిన అన్యాయం కంటే.. సీమాంధ్రుడైన వెంకయ్యనాయుడు చేసే అన్యాయమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో అన్నీ విధాలుగా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవటం కోసం ప్రత్యేక హోదా కల్పించాలని పోరాడిన వెంకయ్య.. విభజన బిల్లు లోక్ సభలో పాసయ్యాక.. రాజ్యసభలో చర్చకు తెచ్చి.. నాటి ప్రధాని మన్మోహన్ చేత ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చేలా చేసిన వెంకయ్యనాయుడు.. అదే సమయంలో త్వరలో తమ సర్కారు రానుందని.. ఏపీకి ప్రత్యేక హోదాను పదేళ్లు చేస్తామంటూ చెప్పి అందరి మనసు దోచుకున్నారు.

కట్ చేస్తే.. నాడు విఫక్షంలో ఉన్న సమయంలో ఏపీ ప్రత్యేక హోదా విషయంపై చించుకున్న వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రత్యేక హోదా మీద పిల్లి మొగ్గలు వేయటం తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా విషయంపై భిన్నమైన వ్యాఖ్యలు చేసిన వెంకయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అచ్చు మెమరీలాస్ అయిన వ్యక్తిగా వ్యవహరించారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయం 60 శాతం వరకూ పూర్తి అయ్యిందని ఏపీ మంత్రి సుజనా చౌదరి  హద్య లెక్కల విషయమై మాట్లాడటం తెలిసిందే. ఒకవైపు.. ప్రత్యేక హోదా విషయంపై తనను అడుగుతున్న ప్రశ్నలకు వెంకయ్య తన చావు తెలివితేటల్ని ప్రదర్శించారు. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో లేదని... అలాంటప్పుడు ప్రత్యేక హోదా ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.

విభజన చటటంలో ఏపీకి ప్రత్యేక హోదా గురించి తనకు తానుగా పోరాడిన వెంకయ్య లాంటి వ్యక్తి ఈ రోజు మోడీ మనసు దోచుకోవటానికి కోట్లాది మంది ప్రయోజనాల్ని పణంగా పెట్టేందుకు బరి తెగించటం.. ఈ సందర్భంగా తనకు తాను మెమరీ లాస్ వ్యక్తిగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏపీకి ప్రత్యేకహోదా అంశం విభజన చట్టంలో లేదుగా అంటూ తెలివిగా మాట్లాడుతన్న వెంకయ్యకు సీమాంధ్రులు బుద్ధి చెప్పాలన్న ధోరణి వ్యక్తమవుతోంది. అవసరం కోసం వచ్చే మెమరీ లాస్ వ్యాధిని కంట్రోల్ చేయకుంటే.. రానున్న రోజుల్లో ఏపీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది సుమా.
Tags:    

Similar News