కేంద్రంలో కొలువు తీరే ఏపార్టీ అయినా వారి లెక్కలన్నీ రాజకీయ ప్రయోజనాల మీదనే తప్పించి.. ప్రజల మీదన కాదన్న విషయం మరోసారి రుజువైంది. మోడీ మీద ఉన్న అభిమానంతో తెలుగు ప్రజలు ఆయన్నుకీర్తిస్తారు. వెనుకేసుకు రావటం కనిపిస్తుంది. మరి.. అంతలా వెనకేసుకొచ్చే మోడీ.. ఏపీకి ఏమైనా చేశారా? అంటే పెద్ద ప్రశ్నే తప్ప సమాధానం అస్సలు రాదు.
రాజకీయ పార్టీలకు.. నేతలకు మాత్రమే రాజకీయ ప్రయోజనాన్ని కలిగించే అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం ఎంత సీరియస్ గా పని చేస్తుందో.. ఎంత స్పీడ్ గా ప్రాసెస్ జరుగుతుందో తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటల్ని వింటే ఇట్టే తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపు అంశానికి సంబంధించిన ఫైలు న్యాయశాఖ వద్ద ఉందన్న విషయాన్ని చెబుతున్న వెంకయ్య.. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత హోంశాఖ ఈ ప్రక్రియను షురూ చేస్తుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులోకి తెస్తామన్న విషయాన్ని స్పస్టంగా చెప్పలేనని చెప్పిన వెంకయ్య..వీలైనంత త్వరగా పార్లమెంటులో ప్రవేశ పెడతామని చెప్పుకొచ్చారు.
కేవలం రాజకీయ పార్టీలకు.. నాయకులకు మాత్రమే లబ్థి చేకూర్చే ఈ అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారంలో ఇంతగా అప్ డేట్ చేస్తున్న వెంకయ్య.. ఏపీకి అత్యవసరమైన ప్రత్యేక హోదా గురించి సూటి మాట చెప్పటానికి మాత్రం నీళ్లు నమలటం కనిపిస్తుంది. ప్రజలకు మేలు చేసే విషయంలో మీనవేషాలు లెక్కేస్తున్న వెంకయ్య.. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో మాత్రం మహా దూకుడుగా ఉండటం గమనార్హం.