కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీలలో తొలి విడతగా నిధులు విడుదల చేసి పనులు చేపట్టడానికి ఈ డిసెంబరులోగా 20 పట్టణాలను ఎంపిక చేయబోతున్నట్లుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. మొత్తానికి ప్రతి రాష్ట్రానికి కొన్నేసి వంతున స్మార్ట్ సిటీలను ఎంపిక చేసినట్లు ఇటీవల వెంకయ్యే ప్రకటించారు. మళ్లీ అందులో ఏం మతలబులు దొర్లాయో మనకు తెలియదు గానీ.. తొలి విడత నిధులు ఇవ్వడానిక అనే నెపం పెట్టి.. 20 పట్టణాలనే ఎంపిక చేస్తున్నాం అని వెంకయ్య అంటున్నారు.
మరి ఈ డిసెంబరుకు నిధులు వచ్చేలా దేశానికంతా కలిపి 20 నగరాలే ఎంపిక అయితే.. మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది చాలా మందికి సందేహంగా ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారట.
ప్రస్తుతానికి తొలిజాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి మూడు వంతున ఎంపిక చేసి ఉన్నారు. అందులోంచి వడపోసి.. ఫైనల్ జాబితాలో చెరొక నగరం అయినా ఎంపిక చేసినట్లు శుభవార్త చెప్పాలని జనం కోరుకుంటున్నారు.