''హక్కుల'' గురించి నిజం మాట్లాడిన మొదటి నేత?

Update: 2015-04-11 11:37 GMT
మానవహక్కులు మనుషులందరికి ఉంటాయా?.. ఉండవా? ప్రజాస్వామ్యవాదులకు.. జాతీయవాదుల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. మానవహక్కులు అంటే.. ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్‌ చేసే వారికి.. సిమీ ఉగ్రవాదులకు.. శుక్రవారం పూట ప్రార్థనలు చేసి వస్తూ రాళ్లు విసిరి.. గాయపరిచే వారికి మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ స్వతంత్య్ర భారతంలో తొలిసారి ఒక రాజకీయ నాయకుడు నిజాయితీగా మాట్లాడటం విశేషం.

అలా నిజాయితీగా మాట్లాడిన వ్యక్తి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన సిమీ ఉగ్రవాదులకు అనుకూలంగా మజ్లిస్‌.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటమే కాదు.. మజ్లిస్‌ ఎమ్మెల్యే అయితే ఉగ్రవాది అంత్యక్రియలకు సైతం హాజరయ్యారు. ా

ఇక.. విలువైన ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్‌ చేస్తూ జాతిసంపదను దోచుకునే వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయటం.. ఈ సందర్భంగా రాళ్లదాడి చేయటంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే 20 మంది స్మగ్లర్లు మరణించటం తెలిసిందే. శేషాచల అడవుల్లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారంతా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారుకావటంతో తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ మానవహక్కుల గురించి తెగ మాట్లాడేస్తున్నాయి.

మరి.. ఇంత ప్రజాస్వామికవాదులు తమకొచ్చిన సందేహాల్ని శాంతియుతంగా ప్రశ్నించాల్సింది పోయి.. దాడులు చేయటం.. దొమ్మి చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ల మీద గొంతు చించుకుంటున్న పార్టీలు.. తాజా దాడుల గురించి మాత్రం పల్లెత్తు మాట మాట్లాడని పరిస్థితి. ఎందుకు మాట్లాడరంటూ ప్రజలు సైతం పార్టీ నేతల కాలర్లు పుచ్చుకొని అడగని దుస్థితి.

శుక్రవారం నాడు మక్కా మసీదు దగ్గర ప్రార్థనలు ముగించిన తర్వాత ముస్లిం యువకుల గుంపు పోలీసుల మీద రాళ్లదాడి చేశారు. పోలీస్‌ ఔట్‌పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనల్లో ఒక ఎసీపీకి గాయాలయ్యాయి. కానీ.. ఈ ఘటనపై ఒక్క నేత అంటే ఒక్క నేత కూడా మట్లాడలేదు.. ఖండించలేదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారిని ఎందుకు వదిలేస్తున్నట్లు?

తమ చేతలతో మిగిలిన ప్రజానీకాన్ని ఇబ్బందులుపెడుతున్న గుంపుకు ప్రత్యేక అధికారాలు.. హక్కులు ఉన్నాయా? ఆ గుంపు చేసిన రాళ్లదాడిలో ఆస్తినష్టం కూడా భారీగానే సాగింది. మరి.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

ఇలాంటి ఘటనపై ఎవరూ మాట్లాడని వేళ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రియాక్ట్‌ అయ్యారు. సిమీ కార్యకర్తలను.. ఎర్రచందనం దొంగలను చంపితే మానవహక్కులు గుర్తుకు వస్తాయా? విధి నిర్వహణలో అధికారులు చనిపోతే మానవహక్కులు ఉండవా? అని సూటిగా ప్రశ్నించారు. మానవహక్కుల సంఘాలకు ద్వంద ప్రమాణాలు ఉండటం సరికాదన్న వెంకయ్య.. ఉగ్రవాదులు పోలీసులను చంపినప్పుడు మజ్లిస్‌ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.

మరి.. అలాంటి మజ్లిస్‌ నేతల వైఖరిని ఏ పార్టీ కానీ.. ఏ హక్కుల సంఘం కానీ ఎందుకు ప్రశ్నించదు? మైనార్టీలు.. మెజార్టీలు అనే కన్నా ఒక విషయంలో తప్పు ఒప్పులు మాత్రమే చూసే రోజులు ఎప్పుడు వస్తాయి? ఈ విషయాలపై రాజకీయనాయకులు తమ మౌనాన్ని ఎప్పుడు వీడతారు..?ద దొంగల (కూలీలు అనాలా?) వశం అవుతోంది.

Tags:    

Similar News