వెంక‌య్య గారు మ‌ళ్లీ అదే మాట చెప్పేశారు

Update: 2017-04-22 10:08 GMT
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేంద్రంలో ఎన్డీయే మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గన్నవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి మ‌రోమారు త‌న‌దైన శైలిలో నొక్కి వ‌క్కాణించారు. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీకి ఎంతో మేలు చేశాన‌ని చెప్పుకొచ్చారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటుందని వెంక‌య్య‌నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.

పేదల ముఖాలలో సంతోషం చూడాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని వెంకయ్యనాయుడు అన్నారు. మూడేళ్ల సుపరిపాలన కారణంగా ప్రధాని మోడీ పేరు ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ చేరిందన్నారు. దేశమంతా ప్రధాని మోడీ నినాదమే మార్మోగుతోందని వెంకయ్య అన్నారు. భీమ్ యాప్ ద్వారా చెనేత - వృత్తి కళాకారులకు రుణాలను అందజేశారు. దేశంలోని 65 శాతం భూభాగంలో బీజేపీ అధికారంలో ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీ కార్యకర్తల భుజస్కంధాలపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని వెంకయ్య అన్నారు. పార్లమెంటులో 352 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారన్నారు. బీజేపీ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామ రక్ష అని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ప్రతి  ఒక్కరూ వీఐపీలేనని భావించే మోడీ  బుగ్గకార్లు వద్దన్నారని వెంకయ్య అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News