నోటికి వచ్చినట్లు మాట్లాడే వారి మాటలకు కళ్లాలు వేయాల్సిన బాధ్యత కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కారు మీద ఉంది. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లన్న పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు హిందుత్వ వాదులు కొందరు చెలరేగిపోతుంటారన్న చెడ్డపేరుంది. దీనికి తగ్గట్లే మోడీ పవర్ లోకి వచ్చాక నోటికి వచ్చినట్లుగా మాట్లాడే వారి సంఖ్య పెరిగింది.ఎప్పుడూ లేంది.. ఈ తరహా వ్యాఖ్యలు దేశంలో కలకలానికి గురి చేస్తున్నాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే..కొందరు చేసే వ్యాఖ్యలు బీజేపీకి ఏమాత్రం సంబంధం లేకున్నా.. మోడీ అండ్ కో అండతోనే వారు మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది కమలనాథులకు మరిన్ని కష్టాల్ని తెచ్చి పెడుతోంది.
రెండు రోజుల క్రితం స్వామి స్వరూపానంద సరవస్వతి చేసిన వ్యాఖ్యల్నే చూస్తే ఆయన హద్దులు దాటి మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తుంది. శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించటం వారికి కష్టాల్ని తెచ్చి పెడుతోందన్న మాటతో పాటు.. మహారాష్ట్రలో షిర్డీ సాయిని పూజించటం కారణంగానే ఆ రాష్ట్రంలో కరువు ఉందంటూ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
ఇలాంటి వారి వ్యాఖ్యల్ని వామపక్షవాదులు.. కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ నేతలే స్పందించాల్సి ఉంది. అయితే.. ఇలాంటి వ్యాఖ్యల్ని వెనువెంటనే ఖండించాల్సిన అవసరం ఉన్నా మోడీ పరివారం ఆ విషయాల్నే పట్టించుకోలేదు. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య ఈ వ్యాఖ్యల మీద రియాక్ట్ అయ్యారు. స్వామీజీ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టటమే కాదు.. మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. తప్పుడు మాట్లాడే వారి మాటల్ని తిరస్కరించటానికి మరీ అంత మర్యాద ఎందుకో? పనికిరాని మాటలు మాట్లాడే వారిని.. తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పేందుకూ మర్యాదగానే చెప్పాలా?