అమ‌రావ‌తితో ఐస్ చేసిన వెంక‌య్య‌

Update: 2015-10-23 08:43 GMT
అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఏపీకి ప్ర‌త్యేక హోదా, ప‌్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వ‌క‌పోవ‌డంపై వెల్లువెత్తిన నిర‌స‌న‌ను త‌గ్గించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో నిర్మాణం కానున్న అమ‌రావ‌తిని కేంద్ర ప్ర‌భుత్వ పథ‌కమైన అమృత్ పథకం కింద చేర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వెంకయ్యనాయుడు తెలిపారు.

త‌న కూతురు నేతృత్వంలోని స్వర్ణభారత్ ట్రస్టు భవన నిర్మాణ భూమి పూజను  వెంక‌య్య‌నాయుడు శంషాబాద్‌ లో  చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం సహాయం చేయ‌డ‌మ‌న్నది నిరంతర ప్రక్రియ అని అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేరుస్తుందని, అందులో సందేహం లేదని వెంకయ్య అన్నారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ లోగా చౌకబారు విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు హితవు చెప్పారు. శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మోడీ కూడా ఇదే విష‌యాన్ని చెప్పార‌ని గుర్తుచేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలకూ సహాయం అందించేందుకు కేంద్ర సిద్ధంగా ఉంద‌న్నారు. ప్రధానమంత్రి మోడీ అమరావతి శంకుస్థాపన సందర్భంగా స్పష్టంగా చెప్పారని అన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున జ‌రిగే నిర్ణ‌యాల్లో ఆచితూచీ అడుగు వేయాల‌ని, ఈ క్ర‌మంలో ఒకింత ఆల‌స్యం స‌హ‌జ‌మ‌ని వెంక‌య్య‌నాయుడు చెప్పారు.
Tags:    

Similar News