సామాన్యులకే కాదు సెల్రబిటీలకు పిచ్చ పిచ్చగా నచ్చేసిన ‘‘శ్రీమంతుడు’’ మూవీ.. ఇప్పుడు రాజకీయ నేతల మనసుల్ని దోచుకుంటోంది. కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే పలు రికార్డుల్ని బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా శ్రీమంతుడి సినిమాను చూసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి.. ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ఎంతలా అంటే.. ‘‘శ్రీమంతుడు సినిమా చూస్తుంటే.. తనను దృష్టిలో పెట్టుకునే సినిమా తీశారా?’’ అని అనిపించిందంటూ చిన్నపాటి షాక్ ఇచ్చారు.
హీరో మహేశ్ బావ.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. చిత్ర నిర్మాతలు వెంకయ్యలు కలిసి ఈ సినిమాను ఢిల్లీలో చూశారు. తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు.. అన్ని సౌకర్యాలూ సమకూర్చేందుకు కృషి చేశానని.. ఇప్పటికీ సంక్రాంతికి ఊరికి వెళతానన్న వెంకయ్య.. మనవళ్లు.. మనమరాళ్లను అక్కడి తీసుకెళ్తుంటానని చెప్పారు.
గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాల కోసం వారు భాగం కావాలని తాను చెబుతుంటానని.. శ్రీమంతుడిలో చూపించిన విధంగానే.. గ్రామీణ సంస్కృతిని పరిరక్షించుకోవాలని వ్యాఖ్యానించాడు. తనకు తాను శ్రీమంతుడినని ఫీలవుతున్న వెంకయ్యనాయుడు.. తాను పుట్టిన గడ్డ గురించి.. విభజన బిల్లు సందర్భంగా హామీ ఇచ్చి.. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రత్యేక హోదా తూచ్ అని ఎలా అనగలిగారు?
తనకు తాను గొప్పలు చెప్పుకునేందుకు మక్కువ ప్రదర్శిస్తున్న వెంకయ్య మాటలు వింటే.. కాస్తంత షాక్ తగలటం ఖాయం. నిజంగా వెంకయ్య కానీ శ్రీమంతుడే అయితే.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే..ప్రత్యేక హోదా సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ఇస్తామంటూ రాజ్యసభలో బీరాలు పలికిన మాటల్ని యథాతథంగా అమలు చేసే వారేమో. తనకు జన్మనిచ్చిన గడ్డకు పార్లమెంటులో గట్టిగా నిలదీసిన వ్యక్తి.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. దానికి భిన్నంగా వినిపించే వెంకయ్య శ్రీమంతుడా..?