వెంక‌య్య‌కు పొరుగు రాష్ట్రం అంటే ఎంత ప్రేమ‌

Update: 2016-10-21 06:42 GMT
ఎం.వెంకయ్య నాయుడు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న తెలుగు నాయ‌కుడు. మాట‌ల మాంత్రికుడైన వెంక‌య్య వేడుక ఏదైనా సంద‌ర్భోచిత కామెంట్లు చేయ‌డంలో ముందుంటారు. తాజాగా విశాఖ జిల్లా సబ్బవరం వద్ద నిర్మించనున్న పెట్రోలియం యూనివర్శిటీ సభలో ఇదే త‌ర‌హాలో ప్ర‌వ‌ర్తించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అతిథులను తలపాగలు, టోపీలతో అలంకరించారు. ఇదే సమయంలో వెంకయ్య నాయుడు,ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అశోక్‌గపతిరాజుకు కు రాజస్ధానీ సంప్రదాయంతో తయారు చేసిన తలపాగా పెట్టారు.  అయితే వెంక‌య్య మిన‌హా మిగ‌తా వారు తమ తమ తలపాగలు, టోపీలు తీసి పక్కన పెట్టేయ‌గా...వెంకయ్య నాయుడు మాత్రం తలపాగాను అలానే ఉంచుకున్నారు.

కాసేపటికి ప్రసంగించడానికి మైకు ముందుకు వచ్చిన వెంక‌య్య‌నాయుడు  తలపాగా రహస్యాన్ని సభికులకు వివరించారు. తన తలపాగ తీసి సభికులకు చూపిస్తూ ‘నేను మొన్నటి వరకూ కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. తొలిసారిగా రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంపై ఉన్న గౌరవంగా ఈ తలపాగాను తీయకుండా ఉంచుకున్నాను’ అని చెప్పారు. వెంకయ్య నాయుడుకు రాజ‌స్తాన్ మీద ఉన్న మ‌మ‌కారంపై ప్ర‌శంస‌నీయం అయితే అదే స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుంద‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News