ఏం.. మాకు పౌరుషం లేదా? మాకు ఆత్మాభిమానం లేదా? మా కాకినాడకు వచ్చి మమ్మల్ని విభజిస్తామన్న మాటలు చెబుతారా? బీజేపీకి ఎంత ధైర్యం? అంటూ వీరావేశంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగ హోరు మర్చిపోకముందే మరో ఆసక్తికరఘటన జరిగిపోయింది. తమను తీవ్రంగా మోసం చేశారని.. హోదా విషయంలో మోడీ సర్కారు తమకు హ్యాండిచ్చిందని సీమాంధ్రులు రగిలిపోతున్నారన్న మాటలు వినిపిస్తున్న వేళ.. సీమాంధ్ర నడిబొడ్డున ఉన్న బెజవాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి ఘన సన్మానం జరిగింది.
ఏపీ కోసంప్రత్యేకసాయాన్ని కేంద్రం నుంచి తీసుకొచ్చినందుకు వెంకయ్యకు భారీ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. తానుబెజవాడకు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. సీమాంధ్రులున్న చోట ఏవరైనా.. ఏమైనా చేయొచ్చన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీమాంద్రులు సానుకూలంగా ఉన్నారని.. ఆ విషయం స్పస్టం చేసేందుకే తాను బెజవాడకు వచ్చినట్లు వెల్లడించారు.
ప్యాకేజీ మీద వస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టేందుకే తాను విజయవాడ వచ్చినట్లు చెప్పిన ఆయన.. తెలుగు ప్రజలు గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాగాలాండ్.. మిజోరాం.. అసోం.. సిక్కిం లాంటి సరిహద్దు రాష్ట్రాలు.. హిమాచల్ ప్రదేశ్.. జమ్ముకశ్మీర్ లాంటి కొండ ప్రాంతాలను ప్రత్యేకంగా చూడాలని హోదా ఇచ్చారని.. ఏపీకి అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో పార్లమెంటులో అడిగానని.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టమైందన్నారు.
2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ 2014 వరకు పట్టించుకోలేదన్న వెంకయ్య.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయన్నారు. పార్లమెంటులో తాను కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే కాదు.. విభజన కారణంగా ఏపీకి ఏర్పడిన నష్టాన్ని పూడ్చాలని కోరినట్లుగా చెప్పారు.
1972లో ఏపీని కానీ విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోయి ఉండేదన్న వెంకయ్య.. జైఆంధ్రా ఉద్యమంలో తాను కూడా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ముచ్చట్లను చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉంటే పరిస్థితి మరోలా ఉందని చెప్పే వెంకయ్య.. ఇప్పుడు అదే పనిని తాము ఎందుకు చేయలేమన్న మాటను ప్రస్తావించకపోవటం గమనార్హం. టీడీపీ.. బీజేపీ నేతలు కలిసి ఏర్పాటు చేసిన వెంకయ్య సన్మాన కార్యక్రమం చెప్పేది ఒక్కటే. సీమాంధ్రులకు ఏ హామీ ఇచ్చినా.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటమే కాదు..సన్మానాలు చేసుకోవచ్చన్న విషయాన్ని వెంకయ్య తన చేతల ద్వారా చెప్పేశారు.