రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురు ఎంపిక అయ్యే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం అధికార టీడీపీకి మూడు.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు రాజ్యసభకు ఎంపిక కావటం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా నాలుగో స్థానం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నేసిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయి వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం.. ఈ అంశంపై చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని.. వైఎస్ జగన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. బాబు అనుకున్నంతనే అన్ని జరిగిపోవన్న విషయం తాజా ఉదంతం రుజువు చేస్తుందని చెప్పక తప్పదు. బాబు స్వతంత్రుడు కాదని.. ఆయన ఎన్డీయే పక్షంలో ఉండటంతో.. ఆయన వేసే అడుగుల మీద బీజేపీ నియంత్రణ ఎంతోకొంత ఉంటుందన్న విషయం తాజాగా తేలినట్లేనని చెప్పక తప్పదు.
నాలుగో అభ్యర్థి ఎంపిక దిశగా బాబు ప్రయత్నాలు షురూ చేసిన వెంటనే.. ఏపీ ముఖ్యమంత్రి అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారని.. మోడీ సర్కారులో భాగస్వామ్యమైన టీడీపీ ఇలాంటి పనులు చేయటం ఏమిటంటూ వైఎస్ జగన్ పార్టీ నేతలు చేసిన విమర్శ కమలనాథులకు సూటిగా తాకిందని చెబుతున్నారు. నాలుగో అభ్యర్థిని బాబు రంగంలోకి దించితే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని.. మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుందన్న భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు సీన్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపి లేనిపోని విమర్శలు తెచ్చుకునే కన్నా.. ఉన్న బలం వరకూ పరిమితం అయితే బాగుంటుందన్న విషయాన్ని బాబుకు అర్థమయ్యేలా వెంకయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. బాబుతో మంచి సంబంధాలున్న వెంకయ్య తనకు తానే నేరుగా రంగంలోకి దిగినందుకే.. నాలుగో అభ్యర్థి ఎంపిక విషయంలో బాబు స్పీడ్ తగ్గించినట్లుగా సమాచారం. మరి.. బాబు మీద వెంకయ్య మాట ఎంత పని చేస్తుందో చూడాలి.