బెగ్గింగ్ చేయ‌వ‌ద్ద‌ని మంత్రుల‌ను కోరిన వెంక‌య్య‌

Update: 2017-12-29 17:26 GMT
సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌ - భార‌త ఉప రాష్ట్రప‌తి రాజ్య‌స‌భ‌ను సంస్క‌ర‌ణ‌ల ప‌ర్వంలో ముందుకు తీసుకువెళుతున్నారు. ఇప్ప‌టికే అనూహ్య రీతిలో అన‌ర్హ‌త ఫిర్యాదులుపై త్వ‌రిత‌గతిన నిర్ణ‌యం తీసుకున్న వెంక‌య్య‌...త‌న మార్కును చెప్ప‌క‌నే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం అనంత‌రం రాజ్య‌స‌భ స‌భ్యుడైన దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ ప్ర‌సంగిస్తుండ‌గా స‌భ్యులు అడ్డుప‌డ‌టంతో కాస్త క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించారు. దానికి కొనసాగింపుగా...కేంద్ర మంత్రులకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మరోసారి ఓ కీలకమైన సూచన చేశారు.

దయచేసి ఏదైనా బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఐ బెగ్ అన్న పదం వాడొద్దని మరోసారి సూచించారు. నిజానికి ఆయన బాధ్యతలు చేపట్టిన రోజే ఈ సూచన చేసినా.. ఇవాళ న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఓ బిల్లును ప్రవేశపెడుతూ ఆ పదాన్ని వాడారు. దీంతో వెంటనే వెంకయ్య స్పందించి.. `అలా అడుక్కోవద్దు.. ఈ పత్రాలు సమర్పించడానికి లేచి నిల్చున్నాను` అని అనండి అంటూ ఆయనకు సూచించారు. ఆయన బెగ్ అన్న పదం వాడగానే నో బెగ్గింగ్ ప్లీజ్ అంటూ నాయుడు స్పందించారు. బహుశా తొలిరోజు నేను ఈ విషయం చెప్పినపుడు పీపీ చౌదరి సభలో లేరేమో అని వెంకయ్య అన్నారు.

నిజానికి డిసెంబర్ 15న చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య `ఐ  బెగ్‌ టూ మూవ్ వాడ‌వ‌ద్దు` సూచన చేసిన తర్వాత మంత్రులెవరూ బెగ్ అన్న పదాన్ని వాడటం లేదు. అయితే తాజాగా మంత్రి ఈ ప‌దం వాడ‌టం లేదు. అయితే బ‌హుశా న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరికి ఈ విష‌యంలో స‌మాచారం తెలిసి ఉండ‌క‌పోవ‌డం లేదా..ఆయ‌న స‌భ‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని అనుకుంటున్నారు.
Tags:    

Similar News