తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత మహానేత నందమూరి తారక రామారావుకి ఒక గౌరవం దక్కనుంది. ఆయన విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయనున్నారు. కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలుగు సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని జూలై ఐదున ఆవిష్కరించనున్నారు. కాలిఫోర్నియాలోని తెలుగు సంఘాల వారి నేతృత్వంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమెరికాలో తెలుగువారు నిర్వహించనున్న తానా.. నాట్స్ సభల్లో ముఖ్యఅతిధిగా హాజరయ్యేందుకు వెళుతున్న వెంకయ్య ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గననున్నారు.
పొరుగన ఉన్న ఢిల్లీలోని సర్కారు ఎన్టీఆర్‌ని గుర్తించకున్నా.. అమెరికాలో ఎన్టీవోడు కృష్ణుడు రూపంలో దర్శనమిస్తూ.. తెలుగువారికి మరింత స్ఫూర్తిని ఇవ్వనున్నారన్న మాట.