జ‌గ‌న్ కు వెంక‌య్య ట్వీట్‌.. బాబు లేఖ‌!

Update: 2019-05-30 08:51 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వైఎస్ జ‌గ‌న్మోన్ రెడ్డికి.. అంత‌కు ముందు ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు అభినంద‌న ట్వీట్ చేశారు. అదే విధంగా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక లేఖ రాశారు. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి ముందుగా ఈ ప్ర‌ముఖులు ఇద్ద‌రూ అభినంద‌న‌లు తెలిపారు.

వెంక‌య్య త‌న అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేసి.. కేంద్రం.. రాష్ట్రం రెండు క‌లిసిక‌ట్టుగా టీమిండియా స్పిరిట్ ను కొన‌సాగిస్తార‌న్న  న‌మ్మ‌కం త‌న‌కుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఒక మోడ‌ల్ స్టేట్ గా అభివృద్ధి చేస్తార‌ని.. మంచి పాల‌న‌ను అందిస్తార‌ని.. ప్ర‌జ‌ల‌కు చ‌క్క‌టి వ‌స‌తుల్ని క‌ల్పిస్తార‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

వెంక‌య్య ట్వీట్ ఇలా ఉంటే.. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాసిన లేఖ‌లో జ‌గ‌న్ కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్ర స‌మ‌గ్రాభివృధ్ధి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. పేద‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా కృషి చేయాల‌ని సూచ‌న చేశారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్షంగా నిర్మాణాత్మ‌క స‌హ‌క‌రాన్ని అందిస్తామ‌నిలేఖ‌లో పేర్కొన్నారు. జ‌గ‌న్ కు తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.
Tags:    

Similar News