విద్య‌ను కాషాయీక‌రిస్తే.. త‌ప్పేంటి? : ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య

Update: 2022-03-20 08:30 GMT
దేశంలో ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న విద్యా విధానాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టాల‌ని.. మ‌న‌కంటూ.. ఉన్న భార‌తీయత‌ను విద్య‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. అంతేకాదు.. ``విద్య ను కాషాయీకరిస్తే తప్పేంటి`` అని ప్రశ్నించారు.

భారత నూతన విద్యావిధానంలో భారతీయత కేంద్రబిందువని, ఇది మాతృభాషలను ప్రోత్సహించిస్తుందని తెలిపారు.

``దేశంలో విద్యను కాషాయీకరణ చేస్తున్నట్లు కొంద‌రు విమర్శిస్తున్నారు. కానీ కాషాయంతో తప్పేముంది?' అని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.

విద్యకు సంబంధించి మెకాలే విధానాన్ని దేశం నుంచి పూర్తిగా తిరస్కరించాలని.. ఇది విదేశీ భాషా మాధ్యమాన్ని రుద్దుతుందని అన్నారు. భారత నూతన విద్యావిధానంలో భారతీయత కేంద్రబిందువని, ఇది మాతృభాషలను ప్రోత్సహించడాన్ని ఉద్ఘాటిస్తుంద ని చెప్పారు.

హరిద్వార్‌లోని దేవ్‌ సంస్కృతి విశ్వవిద్యాలయ వద్ద 'సౌత్‌ ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ రీకన్సీలియేషన్‌'ను ప్రారంభించిన సందర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌.. భాష‌ల‌పై మాట్లాడారు. మన మాతృభాషను ప్రేమించాలని.. వలసవాద భావజాలాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాతృభాష గొప్పతనాన్ని ఆయన వివరించారు.

'మన సంస్కృతి, వారసత్వ సంపద, పూర్వీకులు మనకు గర్వకారణం. మన మూలాల్లోకి వెళ్లాలి. భారతీయ గుర్తింపు మనకు గర్వకారణమని పిల్లలకు చెప్పాలి. వీలయినన్ని ఎక్కువ భారతీయ భాషలను నేర్చుకోవాలి. వేదాలను తెలుసుకోవడానికి సంస్కృతాన్ని నేర్చుకోవాలి' అని ఉప రాష్ట్రపతి అన్నారు. మాతృభాషపై విస్తృత ప్రచారం చేసేలా యువతను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Tags:    

Similar News