వేణుమాధ‌వ్ నామినేషన్‌...ఈసారి కామెడీ కాలేదు

Update: 2018-11-19 14:06 GMT
తెలుగు సినిమాలో క‌మెడీయ‌న్‌గా సుప‌రిచితులు అయిన వేణుమాధ‌వ్ కామెడీ చేయ‌కుండానే త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వేణుమాధ‌వ్ కొద్దికాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో తన స్వస్థలం కోదాడ కావడంతో అక్కడి నుండే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని వేణు మాధవ్ నిర్ణయించుకోగా...ఆయన నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. దీనితో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, రెండో ద‌ఫా ఆయ‌న నామినేష‌న్ స‌మ‌ర్పించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో నిలిచిని వేణుమాధ‌వ్ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కోదాడ‌ తహసీల్దారు కార్యాలయంలో అనుచరులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితమే నామినేషన్‌ వేసేందుకు ఆయన తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని అధికారులు తిరస్కరించారు... దీంతో ఇవాళ మరోసారి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని కలిసి వేణుమాధవ్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

నామినేష‌న్ దాఖ‌లు అనంత‌రం వేణుమాధ‌వ్ మాట్లాడుతూ..... ప్రజలకు తనవంతు సేవచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని.. అందరి సహకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ఏ పార్టీ మద్దతు లేకుండానే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తున్నాన‌ని వివ‌రించారు. వేణుమాధవ్ కోదాడలో చదువుకొని మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకొని సినీరంగంలో స్థిరపడిన సంగ‌తిత ఎలిసిందే. కాగా, ఈ ద‌ఫా కామెడీ కాకుండానే...వేణుమాధ‌వ్ ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించార‌ని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా, ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావతిరెడ్డి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ స్థానాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ త‌మ పార్టీలో ఇటీవ‌ల చేరిన టీడీపీ నేత బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌కు అవ‌కాశం క‌ల్పించింది.


Tags:    

Similar News