ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాజుకున్న రచ్చ.. అంతకంతకూ పెరిగిపోటవటమే తప్పించి.. ఎక్కడా తగ్గేట్లు కనిపించట్లేదు. ఈ ఇష్యూలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చే వరకు ఒకలా ఉన్న సీన్.. ఆయన ఎంట్రీ ఇచ్చి వరుస పెట్టి ట్వీట్లమీద ట్వీట్లు.. వీడియోలు పోస్టు చేయటం ద్వారా.. గడిచిన రెండు.. మూడు రోజులుగా ఈ ఇష్యూ మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా మాట్లాడుకునే పరిస్థితి. సినిమా థియేటర్ టికెట్ల ధరలపై వర్మ వాదన ఏపీ సర్కారుకు మంట పుట్టించిన పరిస్థితి.
పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ.. ఏ మాత్రం తగ్గని రీతిలో ట్వీట్లు పోస్టు చేసిన రాంగోపాల్ వర్మ.. బుధవారం సాయంత్రం నుంచి ఆయన ట్వీట్లలో కాస్తంత మార్పుకనిపించటం గమనార్హం. తన ట్వీట్లకు.. వీడియోలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా రియాక్టు కావటం.. దీనిపై వర్మ అభిమాని ఒకరు స్పందించాలని కోరగా.. మంత్రి కొడాలి నాని మాటలకు కౌంటర్ ఇవ్వాలని అందరూ అడుగుతున్నారని.. కానీ తనకుకొడాలి నాని ఎవరో తెలీదని ట్వీట్ చేయటం.. తనకు తెలిసింది హీరో నాచురల్ స్టార్ నాని అంటూ ఇచ్చిన పంచ్.. దిమ్మ తిరిగిపోయేలా మారింది.
దీనికి కారణం.. నేచురల్ స్టార్ నాని.. ఆ మధ్యన ఏపీ సినిమా టికెట్ల ధరల మీద విమర్శలు చేయటం.. ఆ సందర్భంగా ఏపీ మంత్రి ఒకరిని నాని వ్యాఖ్యలపై ప్రశ్నల్ని సంధిస్తే.. తనకు మంత్రి కొడాలి నాని మాత్రమే తెలుసని.. సినిమా నాని గురించి తెలీదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గురి చూసి కొట్టినట్లుగా రాంగోపాల్ వర్మ తాజా ట్వీట్ ఉండటంతో ఇది కాస్తా మహా వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే.. బుధవారం సాయంత్రం ఐదు గంటల వేళలో.. ఆర్జీవీ నుంచి వచ్చిన ట్వీట్ ఆయన తీరుకుకాస్త భిన్నంగా ఉండటం గమనార్హం. మంత్రి పేర్నినానిని ఉద్దేశించి పోస్టు పెట్టిన ఆయన.. ‘‘నానిగారు.. నా రిక్వెస్టు ఏమిటంటే.. మీరు అనుమతి ఇస్తే నేను మిమ్మల్నికలిసి మా తరఫు నుంచి మా సమస్యలకి సంబంధించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. మరో ట్వీట్ లో తనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డ అంటే ప్రత్యేక అభిమానమని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. వర్మ చేసిన ట్వీట్ రిక్వెస్టుకు ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వర్మకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. తప్పకుండా త్వరలోనే కలుద్దామంటూ.. తన స్థాయిని చెప్పకనే చెప్పేశారు. మరి.. ఈ ఇద్దరి మధ్య భేటీ ఎప్పుడైనా కానీ.. అందరిని పెద్ద ఎత్తున ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.