కరోనాకు వయాగ్రా ఔషదమా?

Update: 2020-04-17 01:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔషద తయారీ కంపెనీలు మరియు శాస్త్రవేత్తలు పూర్తిగా కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్‌ ను తయారు చేసే పనిలోనే ఉన్నారు. అన్ని దేశాల్లో శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్‌ విరుగుడును కనిపెట్టేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కరోనా వైరస్‌ బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి వయాగ్రా మంచి ఔషదంగా పని చేస్తుందంటూ యూరప్‌ అమెరికా వంటి దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. వయాగ్రాను దాదాపు అన్ని దేశాల వారు కేవలం సెక్స్‌ సామర్థ్యంను పెంచేందుకు మాత్రమే వినియోగిస్తారు. కాని వయాగ్రాలో అంతకు మించి ఔషదగుణాలు ఉన్నాయట.

ముఖ్యంగా వయాగ్రాలో ఉండే నైట్రిక్‌ ఆక్సైడ్‌ కరోనా పేషంట్‌ కు ప్రముఖంగా ఉపయోగపడుతుందట. నైట్రిక్‌ ఆక్సైడ్‌ అనేది వాయు రూపంలో ఉండి ఊపిరితిత్తుల్లో ఉండే రక్త కణాలను విస్తరింపజేసి శరీరంలో ఆక్సీజన్‌ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నైట్రిక్‌ ఆక్సైడ్‌ ను అందిస్తూ ఉంటారు. అదే నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఇప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులకు కూడా చాలా అవసరం. కరోనా వైరస్‌ మనిషి శరీరంలో చేరిన సమయంలో ఊపిరితిత్తులపై దాడి చేసి వాటి పనిపై ప్రభావం చూపిస్తాయి. దాంతో రక్త ప్రసరణ మరియు ఆక్సీజన్‌ ప్రసరణ జరగక పోవడంతో న్యుమోనియా ఎటాక్‌ అవుతుంది. ఆ సమయంలో వెంటిలేటర్‌ పై రోగిని ఉంచుతారు.

ఇలాంటి సమయంలో ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ అధికంగా ఉండేందుకు శరీరంలో ఆక్సీజన్‌ ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు నైట్రిక్‌ ఆక్సైడ్‌ అవసరం ఉంటుంది. అందుకే అది పుష్కలంగా ఉండే వయాగ్రాను కొందరు శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది అధికారికంగా మాత్రం నిర్థారించలేదు. కనుక రోగ లక్షణాలు ఉన్న వారు సొంతంగా వయాగ్రాను వేసుకోకుండా డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స తీసుకోవడం మంచిది.
Tags:    

Similar News