బీజేపీ సీనియర్ నాయకుడు.. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్య నాయకుడు త్వరలోనే రిటైర్ కానున్నారు. వచ్చే నెలలో ఆయన పదవీ విరమణకు ముహూర్తం ఖరారైం ది. అయితే.. ఆయనను మరోసారి కొనసాగించే అవకాశం ఉందని నిన్న మొన్నటి వరకు కొన్ని అంచనా లు వచ్చినా.. మారిన ఢిల్లీ వ్యూహాలతో ఆయన ను పక్కన పెట్టారు. దీంతో వెంకయ్యకు ముందున్న మార్గం ఏమీ కనిపించలేదు.
ఇక, అదేసమయంలో ఆయన సన్నిహితులు, రాజకీయ సమకాలికులు.. మాత్రం వెంకయ్యను వాడుకుని వదిలేశారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. పార్ల మెంటులో నెగ్గుకురావడం.. బిల్లులు గెలిపించుకోవడం.. అనేది ఎలాగూ జరుగుతుంది. దీనికి పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. లోక్‌సభలో మెజారిటీ ఉన్న పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుం ది కాబట్టి. దీంతో లోక్‌సభలో ఆయా పార్టీకి తిరుగు ఉండదు.
కానీ, అదే అధికార పార్టీకి.. రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం ఎదురుగాలి వీస్తూ ఉంటుంది. ఎందుకంటే.. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి రాజ్యసభలో మెజారిటీ ఉంటుంది కనుక. సో.. అప్పుడు అధికా రంలో ఉన్న పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులను తొలగించే బాధ్యత.. ఉపరాష్ట్రపతిపైనే ఉంటుంది. అందు కే.. కేంద్రంలోని ప్రభుత్వ పార్టీకి.. ఉపరాష్ట్రపతి అవసరం ఎంతో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలానే.. బీజేపీకి కూడా వెంకయ్య దోహద పడ్డారు.
లోక్‌సభలో మోడీ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న నేపథ్యంలో అనేక బిల్లులు సునాయాసంగా ఆమోదం పొందాయి. కానీ, రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. రాజ్యసభలో బీజేపీకి అప్పట్లో బలం లేదు. దీంతో కీలకమైన జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు నుంచి రైతుల మూడు చట్టాల వరకు.. పెట్రోలు చార్జీల నుంచి జీఎస్టీ పరిహారం వరకు అనేక విషయాల్లో రాజ్యసభలో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఇలాంటి సమయంలో సభ చైర్మన్‌గా వెంకయ్య ఆదుకున్నారనే చెప్పాలి.
ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపి, పదేపదే వాయిదా వేసి.. మరీ.. సభను `సజావు`గానే నడిపించారు. ఇది మోడీ సర్కారుకు మేలు చేసింది. దీనినే పరిశీలకులు.. వాడుకోవడం అంటున్నారు. మరి ఇంతగా దోహదపడిన వెంకయ్యకు మరోసారి రెన్యువల్ ఇస్తారని అందరూ భావించారు.కానీ, అనూహ్యంగా ఆయనను పక్కన పెడుతున్నారు. ఉపరాష్ట్రపతి విధివిధానాల మేరకు.. ఆయన వేరే పనిచేసుకునేందుకు అవకాశం లేదు. అలాగని రాజకీయాల్లోనూ కొనసాగేందుకు చాన్స్ లేదు. మరి వెంకయ్య ఏం చేస్తారో చూడాలి.