వీడియో: చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే అనుకరిస్తే నవ్వు ఆపుకోలేక పోయిన జగన్
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుతో రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నాయో.. ఎంతగా శత్రుత్వం ఉందో అందరికీ సంగతి తెలిసిందే. చంద్రబాబుపై ఎవరైనా బాగా పంచులు వేస్తే ఆయన అభినందిస్తారు.. నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
తాజాగా ఉత్తరాంధ్రలో జగన్ పర్యటించిన సమయంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు వాయిస్‌ని అనుకరించాడు. అచ్చం చంద్రబాబులా సభలో మాట్లాడి నవ్వులు పూయించాడు. కరోనా టైంలో చంద్రబాబు సీఎంగా ఉంటే ఏం చేస్తాడో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మిమిక్రీ చేశాడు. ఆ మాటలకు జగన్ హృదయపూర్వకంగా పడీ పడీ నవ్వడం మనకు కనిపించింది. కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం అయితే ఎలా స్పందించేవారో వివరించడానికి రాజు ఈ మిమిక్రీ చేయగా నవ్వులు విరబూసాయి.
ఎమ్మెల్యే అదీప్ రాజు అచ్చం చంద్రబాబులానే మాట్లాడారు. "మా డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు... మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కరోనా వల్ల మనం అందరం కష్ట పడుతున్నాం తమ్ముళ్లు. ..తమ్ముళ్లు, ఈ కరోనా సమయం లో కొత్త పధకం తెస్తున్నాం తమ్ముళ్లు. కరోనా మీద కత్తి యాత్ర" అంటూ ఉన్న పథకాలను చంద్రబాబు ఊడబీకించేవాడని అదీప్ రాజు కామెడీ చేశాడు. మహమ్మారిని కారణంగా అన్ని పథకాలను చంద్రబాబు రద్దు చేసేవాడని ఎమ్మెల్యే సెటైర్ వేశాడు. దానికి జగన్ చాలా ఉల్లాసంగా పడీపడీ నవ్వుకున్నాడు. నవ్వును ఆపుకోలేకపోయాడు.
సాధారణంగా సీఎం ఆనందంగా నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. ఆనందంగా ఉండటం చాలా కష్టం. కానీ ఈ సభలో అదీప్ రాజు మాటలకు నవ్వు ఆపుకోలేకపోయాడు. జగన్ తన మనసులోని భావాలను ఎప్పుడూ ప్రజల్లో వ్యక్తం చేయడు కానీ చంద్రబాబు నాయుడుని విమర్శించే విషయంలో మాత్రం తన ఆనందాన్ని దాచుకోలేడు.
ఇక ఆటోడ్రైవర్లు ఎంత ఆనందంగా జగన్ పాలనలో ఉన్నారో అదీప్ రాజు తెలిపారు. "సార్, నేను ఒక్క ఉదాహరణ చెబుతాను. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. పథకంలో భాగంగా ఆ ఏడాది అక్టోబర్‌లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు అందించారు. కరోనా సమయంలో వాహన మిత్ర నిధులను త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారా అని నేను చాలా మంది ఆటో డ్రైవర్లను అడిగాను. తామెవరం అడగలేదని, అయితే జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తమ సమస్యలు తెలుసుకుని, వచ్చే ఏడాది షెడ్యూల్ కంటే 3 నెలల ముందుగానే నిధులు విడుదల చేశారని' ఆటోడ్రైవర్లు తనతో చెప్పారని అదీప్ రాజు తెలిపారు.
"ఇతరుల కష్టాల గురించి ఆలోచించే, మానవత్వం ఉన్న ఇంత మంచి ముఖ్యమంత్రి మనకు ఎక్కడ లభిస్తాడని జగన్ ను కొనియాడారు వైసీపీ ఎమ్మెల్యే. నా నియోజక వర్గంలో దాదాపు 2 లక్షల మంది పేదలందరికీ ఇల్లు కింద శాశ్వత ఆశ్రయం కల్పించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానన్నారు..
జగన్ సానుభూతి.. దయాదాక్షిణ్యాలకు ఈ ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు. జగన్ పథకాలకు జనం ఆనందిస్తున్నారని అన్నారు.
Full View