పొలం పని చేసేందుకు టైట్ జీన్స్.. కళ్లజోడు పెట్టుకొని.. చేతకి ఖరీదైన వాచీ పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది? ఇంచు మించు అలాంటి తీరునే ప్రదర్శించారు బీజేపీ ఎంపీలు. తాజాగా పార్లమెంటు ఆవరణలో ఉన్న రోడ్డును వారు శుభ్రం చేసిన తీరు చూస్తే.. జోకులు వేసుకోకుండా ఉండలేని పరిస్థితి. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం అందరూ చేయాల్సిందే. అలా అని.. శుభ్రంగా ఉన్న పరిసరాల్ని క్లీన్ చేయటం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు.
దేశంలో అత్యంత శుభ్రంగా ఉండే పార్లమెంటు పరిసరాల్ని.. చీపుర్లు పట్టుకొని ఉడ్చేసిన తీరు ఒక ఎత్తు అయితే.. బీజేపీ ఎంపీల్లో సినీ నటి హేమమాలిని వారి చీపురు ఉడ్చే వ్యవహారంపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని జోకులు పేలాయి. ఇలా కూడా చీపురుతో చిమ్ముతారా? అన్న వ్యంగ్య వ్యాఖ్యలు పలువురు చేశారు.
నల్లటి గాగుల్స్ పెట్టుకొని.. చీపురుతో స్టైల్ గా చిమ్మని వైనం చూసినప్పుడు.. పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలనుకునే దాని కన్నా.. ప్రచారం కోసం పడిన తపన కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ప్రధాని మోడీ కలల ప్రాజెక్టుగా చెప్పే స్వచ్చ భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా.. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన వైనం తెలిసిందే.
ఇందులో భాగంగానే తాజాగా పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమం. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాన్ని ప్రచారం కోసం కాకుండా.. కమిట్ మెంట్ తో తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుంది. అల్రెడీ శుభ్రంగా ఉన్న చోట చీపుర్లను పట్టుకొని చిమ్మేయటం షో గానే మిగులుతుంది తప్పించి సీరియస్ గా అనిపించదు. ఏమైనా.. చీపురును పట్టుకొని చిమ్మే విషయంలో ఆమె ప్రదర్శించిన స్టైల్ కు మాత్రం థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేం.