60 మంది అమ్మాయిల వీడియోల లీక్.. వివాదం స‌మ‌సిన‌ట్టేనా?

Update: 2022-09-20 11:30 GMT
పంజాబ్‌లోని మొహాలిలో ఉన్న యూనివ‌ర్సిటీలో 60 మంది అమ్మాయిల అభ్యంత‌కర వీడియోలు లీక‌య్యాయ‌ని కొద్ది రోజుల క్రితం గ‌గ్గోలు రేగిన సంగ‌తి తెలిసిందే. అదే యూనివ‌ర్సిటీలోని హాస్ట‌ల్‌లో ఉంటున్న ఓ యువ‌తి త‌న అభ్యంత‌ర‌క‌ర చిత్రాల‌ను హిమాచల్ ప్ర‌దేశ్‌లో చ‌దువుతున్న త‌న బాయ్‌ఫ్రెండ్‌కు పంపింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా త‌న వీడియోతోపాటు మ‌రో 60 మంది అమ్మాయిలు స్నానాలు చేసేట‌ప్పుడు ఆ వీడియోల‌ను తీసి త‌న బాయ్‌ఫ్రెండుకు పంపింద‌నే విష‌యం తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ఈ వీడియోలను ఆమె ప్రియుడు ప‌లు పోర్న్ సైట్ల‌లో అప్‌లోడ్ చేశాడ‌నే వార్త తీవ్ర ఆందోళ‌న రేపింది.

ఈ వ్య‌వ‌హారం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించ‌డం.. విద్యార్థినులు యూనివ‌ర్సిటీలో తీవ్ర నిర‌స‌న‌, ఆందోళ‌న‌ల‌కు దిగ‌డం తెలిసిందే. దీంతో పోలీసులు వీడియోలు తీసింద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న
యువ‌తిని, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి సెల్ ఫోన్ల‌ను ఇత‌ర ప‌రిక‌రాల‌ను ఫోరెన్సిక్ లేబొరేట‌రీకి పంపారు.

ఈ వ్య‌వహారంపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స్పందించ‌డం, మ‌రోవైపు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ సింగ్ మాన్ సీరియ‌స్ కావ‌డం, స్వ‌యంగా డీజీపీ ఆధ్వ‌ర్యంలో కేసు ద‌ర్యాప్తు చేస్తుండ‌టంతో విద్యార్థులు త‌మ ఆందోళ‌న‌ను విర‌మించారు.  ఆ యువ‌తి కేవ‌లం త‌న వీడియోనే త‌న ప్రియుడికి పంపింద‌ని పోలీసులు తేల్చారు. మ‌రెవ‌రి వీడియోలు ఆమె ఫోన్‌లో ల‌భించ‌లేద‌ని తెలిపారు. ఊహాగానాల‌ను, వదంతులను విద్యార్థులు న‌మ్మ‌వ‌ద్ద‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.

కాగా వీడియోలు లీక‌య్యాయ‌ని తెలిసి ఆందోళ‌న‌తో కుప్ప‌కూలిన యువతి కూడా ఆస్ప‌త్రిలో కోలుకుంద‌ని పోలీసులు తెలిపారు. ఆరుగురు విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని వ‌చ్చిన వార్త‌లు కూడా అవాస్త‌మ‌న్నారు.

అమ్మాయిల‌ వీడియోల లీక్ కేసులో పోలీసులు సిమ్లాకు చెందిన ఇద్దరు నిందితులతో పాటు యూనివర్సిటీ చెందిన ఓ విద్యార్థినిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీడియో లీక్స్ కేసులో సన్నీ మెహతా, రాంకజ్ వర్మ అనే ఇద్దరు నిందితులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సన్నీ మెహతా అని చెబుతున్నారు.  చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థినిని ప్రియుడే సన్నీ మెహ‌తా. సిమ్లాలోని రోహ్రుకు చెందిన సన్నీ బీఏ వరకు చదివాడని అంటున్నారు. సన్నీ తన సోదరుడితో కలిసి ప్ర‌స్తుతం కేక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడ‌ని చెబుతున్నారు. మరోవైపు రాంకజ్ వర్మ సిమ్లాలోని థియోగ్ లో ఉంటాడ‌ని అతడు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడ‌ని అంటున్నారు.

అలాగే త‌మ‌తో రూడ్ గా ప్ర‌వ‌ర్తించార‌నే విద్యార్థినుల ఆరోప‌ణ‌ల‌తో ఇద్దరు వార్డెన్‌లను చండీగఢ్ యూనివర్సిటీ యాజమాన్యం విధుల నుంచి తొల‌గించింది. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగే వ‌ర‌కు సెప్టెంబర్ 24 వరకు యూనివ‌ర్సిటీకి సెల‌వులు ప్ర‌క‌టించింది. అలాగే హాస్టల్ సమయాలు, విద్యార్థుల డిమాండ్‌లకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News