బీజేపీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు. ఆయన వాజపేయి ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న విద్యాసాగర్ రావుకి దేశంలో కీలక పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర గవర్నర్ పదవి దక్కింది. ఇటీవల ఆయన గవర్నర్ పదవి కాలం ముగియడంతో మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో ఈ పెద్దాయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యహరిస్తారని అనుకున్నారంతా. చుక్కాని లేని నావలా ఉన్న తెలంగాణ బీజేపీకి ఈయనే పెద్ద దిక్కు అని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్యాసాగర్ రావే సీఎం అని ప్రచారం జరిగింది. తెలంగాణ భావి సీఎం.. కేసీఆర్ సామాజికవర్గ నేత.. క్లీన్ ఇమేజ్ ఉండడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తొలగించి తెలంగాణ బీజేపీ సీఎం రేసులో ఈయనను బీజేపీ తీసుకొచ్చిందన్న చర్చ జరిగింది. అయితే ఈయన మాత్రం సైలెంట్ అయి పోయారు. బీజేపీ పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమంలో ఆయన కనబడిన దాఖలాలు లేవు. దీంతో ఆయన దృష్టి ఎటు వైపు అనే చర్చ మొదలైంది.
తెలంగాణలో 2023 ఎన్నికల వరకు బీజేపీని అధికారంలోకి తీసుకువాలని అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. అయితే కరీంనగర్ చెందిన చెన్నమనేని విద్యాసాగర్ అటూవైపు కన్నెత్తి చూడటం లేదు. కరీంనగర్లో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కనిపించిన దాఖలాలు లేవు ఆయన కేవలం హైదరాబాద్ వరకే పరిమితమవుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరుపున ఆయన ప్రచారం చేయలేదు. అలాగే సొంత జిల్లా కరీంనగర్లో పార్టీ నిర్వహించే పౌరసత్వ సవరణ సదస్సుల్లో కూడా విద్యాసాగర్ రావు పాల్గొనడం లేదు. దీంతో ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణలో సీనియర్ల సేవలు అవసరమని బీజేపీ గుర్తించింది. అయితే తెలంగాణకు చెందిన విద్యాసాగర్ పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులను అనుభవించిన ఆయన రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఆయన కేవలం జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారని పలువురు అంటున్నారు. దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తెలంగాణ లో అధికారం చేపట్టాలని ఆశపడుతున్న బీజేపీ అధిష్టానానికి విద్యాసాగర్ తీరు మింగుడు పడటం లేదు. రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోకుండా కేవలం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యం లో విద్యాసాగర్ పయనం జాతీయ రాజకీయాల వైపేనా.. లేక రాష్ట్ర రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తారా? అనేది తెలియడం లేదు. కొన్నిరోజులు పోతేగానీ ఆయన పయనం ఎటూ వైపో క్లారిటీ రాదు.