యావత్ దేశం ఇప్పుడు తమిళనాడు వైపు ఆసక్తిగా చూస్తోంది. ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. వాటి విశేషాల కంటే.. పార్లమెంటు సమావేశాల కంటే కూడా తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుండటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమిళనాడులో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభానికి కారణమైన వారే కాదు.. కీలకమైన గవర్నర్ పాత్రలో ఉండే వారంతా టెంపరరీనే కానీ.. ఎవరూ పర్మినెంట్ కాకపోవటం ఒక విశేషంగా చెప్పాలి.
ముందుగా అన్నాడీఎంకే అధినేత్రిగా వ్యవహరిస్తున్న శశికళనే చూస్తే.. ఆమె అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా.. తాత్కాలికమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. చిన్నమ్మపై ధిక్కార స్వరాన్ని వినిపించి ఆమెపై పోరాటం మొదలెట్టిన పన్నీరు సెల్వం సైతం ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రి తప్ప పూర్తిస్థాయి సీఎం కాదన్నది మర్చిపోకూడదు. ఇక.. తమిళనాడు అధికారపక్షంలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం కారణంగా ఏర్పడే పంచాయితీల్ని ఒక పద్ధతి ప్రకారం ముగింపు పలకాల్సిన బాధ్యత గవర్నర్ మీదనే ఉంది. ఆయన సైతం తమిళనాడుకు తాత్కాలిక గవర్నరే (ఇన్ ఛార్జ్) తప్పించి పూర్తిస్థాయి గవర్నర్ కాకపోవటం మర్చిపోకూడదు. ఇలా.. ముఖ్యమైన ముగ్గురు టెంపరరీలే కావటం ఒక విశేషంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/