అంతకంతకూ ఉత్కంట పెంచుతున్న తమిళ రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిన్నమ్మ.. పన్నీర్ లు చెరోవర్గంగా మారి సీఎం కుర్చీ కోసం ఎవరికి వారుగా చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడి వరకు వెళతాయి? ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే.. ఇదంతా గవర్నర్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి గవర్నర్ మీదన పడింది. ఆయనేం నిర్ణయం తీసుకుంటారు? ఆయన ఎవరి వైపు? అన్న సందేహాలు ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తున్నాయి.
ఈ రోజు సాయంత్రం 5.15 గంటలకు చెన్నైకి రానున్న తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు.. తొలుత పోలీస్.. నిఘా.. వర్గాలతోభేటీ అవుతారని.. పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటారని చెబుతున్నారు. అనంతరం ఆయన ఎవరిని కలుస్తారన్న దానిపై జోరుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ తో భేటీ కోసం అటు పన్నీర్.. ఇటు చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరిలో ఎవరికి మొదట అపాయింట్ మెంట్ ఇస్తారన్నది ఒక ప్రశ్నగా మారింది. గవర్నర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆయన ఇచ్చే అపాయింట్ మెంట్ ఇచ్చే తీరుతో అంచనా వేయొచ్చని కొందరు చెబుతున్నా.. అలాంటిది సరైన అంచనా అనిపించుకోదన్న మాట వినిపిస్తోంది. రాజకీయ పక్షాలకు చెందిన పలువురు నేతలు.. చెన్నై మీడియా వర్గాల అంచనా ప్రకారం.. అపాయింట్ మెంట్ ఎవరికి ఇచ్చినా.. సీఎంగా అవకాశం మాత్రం పన్నీర్ సెల్వానికే ఇచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో.. గవర్నర్ ను కలిసేందుకు వెళ్లే క్రమంలో చిన్నమ్మ తనతో పాటు ఎమ్మెల్యేలందరిని తీసుకెళతారా? లేక ఒంటరిగా వెళతారా? అన్న దానిపై స్పష్టత రావటం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్ని ఒకేసారి రాజ్ భవన్ కు తీసుకురావటం ప్రాక్టికల్ గా ఇబ్బంది అవుతుందన్నమాట వినిపిస్తోంది. ఏమైనా.. గవర్నర్ కేంద్రంగా తమిళరాజకీయాలు తిరగనున్నాయని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/