వార్నింగ్ ఇవ్వటమే కాదు వేటేసిన గవర్నర్

Update: 2017-02-14 04:56 GMT
వ్యవహారాలు సున్నితంగా మారినప్పుడు..అత్యంత జాగరూకతో వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకూడదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నిర్ణయాలు ఎంత కీలకమన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఏమాత్రం తొందరపాటు పనికి రాదన్నది ఎంత అవసరమో తాజాగా తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఆయన్ను ఢిల్లీలోని మోడీ సర్కారు ఆడిస్తోందంటూ తప్పు పట్టినోళ్లు ఉన్నారు. విమర్శిస్తున్న వారూ ఉన్నారు. కానీ.. తమిళనాడులో జరుగుతున్న పరిణామాల్ని సునిశితంగా పరిశీలిస్తే.. ఈ మాత్రం ఆలస్యం అవసరమన్న భావన కలగటం ఖాయం. ఇందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ శశికళ ఒక లేఖను.. తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేలసంతకాలతో కూడిన పత్రాల్ని గవర్నర్ కు ఇచ్చారు. తనను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. ఆమె మాటను విద్యాసాగర్ రావు కానీ ఓకే అనేసి.. ప్రమాణస్వీకారం చేయించి ఉంటే.. ఎవరెంతగా తప్పు పట్టేవారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న ఆయన తీరు వల్ల అనవసరంగా వచ్చి పడే వివాదాలు ఆయన్ను అంటుకోవటం లేదని చెప్పాలి. చిన్నమ్మ ఇచ్చిన జాబితాలో ఆమెకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉన్నఎమ్మెల్యేలు కొందరు తాము ఆమెకు మద్దతు ఇవ్వలేదని చెబుతున్నారు. శశికళ శిబిరం నుంచి తప్పించుకున్న మధురై ఎమ్మెల్యే శరవణన్ తప్పించుకొని మారువేషంలో చెన్నైకి రావటం గమనార్హం. కృష్ణా జిల్లా ఉత్తంగరై ఎమ్మెల్యే మనోరంజితం రియాక్ట్ అవుతూ.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు.

చిన్నమ్మ తనకు లేఖ ఇచ్చిన వెంటనే.. ఎమ్మెల్యేలు పెట్టినట్లుగా చెబుతున్న సంతకాల్ని పరిశీలించే పనిని చేపట్టారు గవర్నర్. ఒకవేళ ఆయన కానీ హడావుడిగా నిర్ణయం తీసుకొని ఉంటే.. ఈ రోజు ఎన్ని ఇష్యూలు తెర మీదకు వచ్చేవి. ఇలా ఆచితూచి అడుగులువేస్తున్న విద్యాసాగర్ రావు.. తేడాగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం వస్తున్న వారిపై వేటు వేసేయటం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పునేపథ్యంలో అల్లర్లు జరగొచ్చంటూ గవర్నర్ విద్యాసాగర్ రావు హెచ్చరించటమే కాదు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయనఆదేశిస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాకార్యదర్శి.. హోం శాఖ కార్యదర్శి.. డీజీపీ.. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన.. ఇంటెలిజెన్స్ ఐజీ కేఎన్ సత్యమూర్తిపై బదిలీ వేటు వేయటమేకాదు.. ఆయన స్థానంలో మరొకరిని నియమించటం గమనార్హం. బాధ్యతలునిర్వర్తించే విషయంలో ఏచిన్న అలసత్వాన్ని తాను సహించనన్న విషయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు తన తాజా నిర్ణయంతో మరోసారి నిరూపించుకున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News