మాల్యాను భారత్‌ కు రప్పించడానికి స్కెచ్

Update: 2018-08-28 11:04 GMT
కష్టపడి తెచ్చుకున్నా.. అక్రమంగా సంపాదించినా సొంత ఆస్తిని వదులుకోవడానికి ఎవరూ వెనుకాడరు. అందులో వివిధ రంగాల ద్వారా కూడబెట్టుకున్న తన సొమ్మును విజయ్‌మాల్యా కూడా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే విజయ్‌ మాల్యా తన ఆస్తుల కోసమైనా భారత్‌కు తిరిగి వస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా భారత్‌ నుంచి పారిపోయి లండన్‌లో తలదాచుకున్న మాల్యాను రప్పించేందుకు భారత్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విజయ్‌మల్యా ఆస్తులను కూడా ప్రభుత్వ పరం చేస్తామని చెప్పడంతో ఆయన వాటిని కాపాడుకునేందుకు భారత్‌కు వస్తుర్నారట.

అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన విజయ్‌మాల్యా భారత్‌ నుంచి పారిపోయి లండన్‌లో ఉంటున్నారు. ఆయనను రప్పించేందుకు భారత్‌ పలు రకాలుగా వినతులు పెడుతోంది. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఆస్తులను చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద కేసు నమోదు చేసింది. గతంలో భారత్‌ తిరిగి వచ్చేందుకు అభ్యంతరం లేదని, అయితే అక్కడి జైళ్లలో సౌకర్యాలు ఉండవని ఆయన తరుపున న్యాయవాది వాదించారు. దీంతో ఆయనకు టీవీ - పేపర్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

దీంతో విజయ్‌ మాల్యా తన రూ.13,500 కోట్ల ఆస్తులను కాపాడుకునేందుకు భారత్‌ కు రానున్నట్లు వినవస్తోంది. ఒకవేళ ఆయన భారత్‌ కు రాకపోతే ఆయన ఆస్తులను ప్రభుత్వ పరం చేసి బాధితులకు పంచే అవకాశం ఉంది. దీంతో ఆయన జైళ్లో ఉండైనా సరే ఆస్తులను వదులుకునే ప్రసక్తేలేదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News