లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన దూకుడు ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. రూ.9000 కోట్లకు పైగా అప్పులను దేశంలోని బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్‌కు చెక్కేసిన మాల్యా అక్కడ కూడా తన జాలీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అంతకుముందు తాను అనుభవించిన స్టేటస్‌లో ఏమాత్రం తేడా రాకుండా చూస్తున్నారు. విలాస గేమ్ అయిన ఫార్ములా వన్ తో తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చారు. ఫార్ములా వన్ కారు రేసింగ్ బృందం సహారా ఫోర్స్ కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్ మాల్యా పాల్గొన్నారు. సిల్వర్ స్టోన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన డ్రైవర్లు పెరీజ్, ఈస్ట్ బన్ తో కలిసి ఫొటోలు దిగారు. గత ఏడాది దేశం నుంచి పారిపోయిన తర్వాత పాల్గొన్న బహిరంగ కార్యక్రమం ఇదే. అంతేకాకుండా ఈ ఫోటోలను ఫార్ములా వన్.కామ్ లో కూడా మాల్యా అప్‌లోడ్ చేయడం గమనార్హం ఈ సందర్భంగా భారతదేశంలోని పరిపాలనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
యునైటెడ్ కింగ్ డమ్ లోని చట్టాల ఆధారంగా తాను చాలా ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నానని మాల్యా ప్రకటించారు. సొంత దేశంలో ఎవరో ఒకరి దయతో బతికే కంటే ఇది సురక్షితమని మాల్యా వ్యాఖ్యానించారు. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తన గురించి ప్రస్తావిస్తూ ప్రధాన పార్టీలు ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేయడం వంటి అంశాల గురించి మాల్యా ప్రస్తవిస్తూ అసలు వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చట్టం ఎప్పుడో తనపని తాను చేసుకుపోయేదని విజయ్ మాల్యా ఎద్దేవా చేశారు. అయినా దాని గురించి చర్చ అవసరం లేదని....ఆధారాలతో వచ్చినప్పుడు స్పందిస్తానని వ్యాఖ్యానించారు. కాగా, భారత్-యూకే అధికారులు మాల్యా అప్పగింతపై చర్చలు జరిపిన రెండు రోజుల తర్వాతే మన దేశం గురించి మాల్యా ఇలా తేలికగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు తన రిచ్ స్టేటస్ ను కొనసాగించడంలో మాల్యా ఏమాత్రం వెనక్కు తగ్గని సంగతి తెలిసిందే. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకొని ఖరీదైన గిఫ్ట్ లు పంపారు. గతంలో తను సారథ్యం వహించిన యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన బ్లాక్ లేబుల్ మద్యం బాటిళ్లను తన మిత్రులకు పండగ సందర్భంగా గిఫ్ట్ రూపంలో విజయ్ మాల్యా పంపించారు. ఇలా వచ్చిన ఓ గిఫ్ట్ ను జర్నలిస్ట్ ఒకరు బయటపెట్టారు. మొత్తంగా విలాసవంతమైన జీవితం, విందులు, వినోదాలకు పెట్టింది పేరయిన లిక్కర్ కింగ్ తన దొంగ చాటు జీవితంలోనూ వాటిని ఏ మాత్రం దూరం పెట్టకపోవడం ఆశ్చర్యకరమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/