ఎట్టకేలకు విజయ మాల్యా అరెస్టు..

Update: 2017-04-18 10:35 GMT
ఏడాది కాలంగా ఇండియన్ పోలీస్ ను ముప్ప తిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎట్టకేలకు  పోలీసులకు చిక్కాడు. ఈ రోజు ఆయన్ను లండన్‌ లో స్కాట్ లాండ్ యార్డు పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ మినిష్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఆయన్ను హాజరుపరుస్తారు. విజ‌య్‌ మాల్యా గ‌త ఏడాది మార్చిలో భార‌తీయ బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విష‌యం తెలిసిందే. ఆ దేశంతో ఇండియాకి ఓ ఒప్పందం కుదురడంతో ఈ అరెస్టు సాధ్యమైనట్లు తెలుస్తోంది.
    
దేశం నుంచి తప్పించుకొని పారిపోయిన విజయ్ మాల్యాపై భారత్ లోని పలు న్యాయస్థానాలు ఎన్నో సార్లు సమన్లు జారీ చేసినా మాల్యా నుంచి రెస్పాన్సు లేదు. తనకు జారీ చేసిన సమన్లపై స్పందించకుండా మొండి వైఖరి కనబర్చారు. అంతేగాక, లండన్ లో ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫొటోలను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ మరింత రెచ్చగొట్టేవాడు. ఆయనను భారత్ కు రప్పించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవీ ఫలితంచలేదు.
    
చివరకు ఇటీవల ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ఈ వ్యవహారంపై  బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మాల్యాను అరెస్టు చేయాలని కోరింది. ఆ మేరకు కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం అక్కడి పోలీసులు మాల్యాను రౌండప్ చేశారు. ఈ రోజు ఆయన్ను అరెస్టు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News