వేలాది కోట్ల రూపాయిల మంది సొమ్మును ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లి పోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా.. ఎంత విలాసవంతంగా బతుకుతున్నది తెలిసిందే. వేలాది కోట్లు ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు రావటమే కాదు.. సోషల్ మీడియా సాక్షిగా అతను చేసిన ట్వీట్లు భారతీయులకు మంట పుట్టేలా చేశాయి.
భారీగా ప్రజల సొమ్మును ఎగ్గొట్టిన అతడికి దిమ్మ తిరిగిపోయేలా షాకివ్వటంలో భారత సర్కారుకు కుదరకున్నా.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సామాన్యుడు ఇచ్చేశాడు. ఊహించని రీతిలో జరిగిన ఈ పరిణామానికి మాల్యాకు తీవ్ర ఇబ్బందిని కలిగించిందని చెప్పక తప్పదు.
వేలాది కోట్లు ఎగ్గొట్టి దర్జాగా వేలాది మంది విలాసవంతంగా క్రికెట్ మ్యాచ్ లను చూస్తున్న మాల్యా.. బయటకు అడుగు పెట్టేందుకు సైతం వణికిపోయేలా చేసే బాధ్యత ఇకపై సామాన్యుడు తీసుకుంటే బాగుండేలా ఉంది. ఎందుకంటే.. పవర్ ఫుల్ అయిన ప్రభుత్వం చేయలేని పనిని సామాన్యుడు చాలా సింఫుల్ గా చేసేశాడు. తాజాగా ఇంగ్లండ్ లోని ఓవల్ ఎరీనాలో భారత్.. దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కు.. ఎప్పటిలానే మాల్యా వచ్చారు.ఈసారి వెంట ఒక స్నేహితుడ్ని తీసుకొని స్టేడియంలోకి అడుగుపెట్టారు.
మాల్యా లోపలికి వచ్చినంతనే ఒక వ్యక్తి వీడియో తీయటం మొదలు పెట్టారు. మరో సామాన్యుడు మాత్రం ఊహించని రీతిలో.. చూడండి.. దొంగ వచ్చేస్తున్నాడు.. ఈ దొంగ స్టేడియంలోకి అడుగు పెడుతున్నాడంటూ పెద్దగా అరవటం మొదలు పెట్టాడు.
దీంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన మాల్యా.. తర్వాత నింపాదిగా వెళ్లిపోయారు. కాకుంటే.. ఊహించని ఈ పరిణామానికి మాల్యా షాక్ తిన్నారని చెప్పక తప్పదు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని మాల్యాకు షాకిచ్చే బాధ్యతను సామాన్యుడు తీసుకొని.. ఆయన ఎక్కడ కనిపించినా.. దొంగ.. దొంగ అంటూ అరిస్తే సరిపోతుందేమో. దెబ్బకు అయ్యగారి అతి తెలివి ఎంతో కొంత తగ్గుతుందేమో?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/