రావాలనుకుంటే మార్గం ఉంది మాల్యా!

Update: 2016-09-16 04:07 GMT
భారత్‌ కు తిరిగి రావాలనే కోరుకుంటున్నట్లు బ్రిటన్‌ లో ఉంటున్న పారిశ్రామికవేత్త - ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుడు విజయ్‌ మాల్యా పేర్కొనడం.. పాస్‌ పోర్ట్ రద్దు వల్లే రాలేకపోతున్నట్లు చెప్పడం తెలిసిందే. ఈ ఏడాది జులై 9న ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసుక్ సంబందించి విజయ్ మాల్యాను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ అవ్వడం.. దీనికి సమాధానంగా తన పాస్ పోర్టు రద్దు అనే కారణం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నా అని మాల్యా ఈ మెయిల్ చేయడం తెలిసిందే.

ఈ మేరకు ఆలోచించిన భారత విదేశాంగ శాఖ భారత్ కు తిరిగి రావాలని ఉన్నా తన పాస్ పోర్టును సీజ్ చేయడం వల్ల రాలేకపోతున్నానని చెప్పిన మాల్యాకు ప్రత్యామ్నాయం చూపింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా పాస్ పోర్ట్ కు సంబందించిన సమస్యలు ఏమైనా వుంటే.. దగ్గరలోని భారతీయ ఎంబసీకి వెళ్లి అత్యవసర ద్రువీకరణపత్రాన్ని పొంది - తిరిగి స్వదేశానికి రావొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ.. ఈ సదుపాయం భారతీయులందరికీ ఉపయోగపడుతుందని, ఇదే క్రమంలో విజయ్ మాల్యాకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. అసలు ఆయనకు రావాలని ఉందని చెప్పేది నిజమే అయితే ఈ సదుపాయాన్ని మాల్యా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

కాగా... విజయ్ మాల్యా పాస్ పోర్ట్ రద్దుచేయడంపై స్పందించిన ఈడీ... మాల్యాపై నమోదయిన ఇతర కేసుల కారణంగా ఆయన పాస్ పోర్టు రద్దు చేయాల్సివచ్చిందని కోర్టుకు నివేదించింది. ఈ కేసును న్యాయమూర్తి అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా విడేశాంగ శాఖ తెలిపిన నిబంధనలను సడలించిన విషయం తెలుసుకుని మాల్యా తిరిగి భారత్ కు వస్తారా? అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న!
Tags:    

Similar News