వేలాది కోట్ల రూపాయిల్ని బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని.. వాటిని చెల్లించకుండా విదేశాలకు ఎగిరిపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత.. లిక్కర్ బారన్ విజయ్ మాల్యాకున్న పలుకుబడి గురించి అందరికి తెలిసిందే. అయితే.. అదే స్థాయిలో ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. రాజకీయ పలుకుబడి ఉన్న నేతలకు మాల్యా ఎలాంటి సేవలు చేసే వారో.. వారి మనసుల్ని ఎంతలా దోచుకునే వారో అన్న విషయాన్ని తాజాగా బయటపెట్టింది రిపబ్లిక్ టీవీ ఛానల్.
రాజకీయ ప్రముఖులకు మాల్యా వారి సేవలు ఏ స్థాయిలో ఉండేవన్న విషయం తాజాగా బయటకు తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో సహా పలువురు రాజకీయ నేతలకు మాల్యా వారు ఎంతలా సేవలు చేసేవారో సదరు ఛానల్ బ్రేక్ చేసింది.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తయారు చేసిన నివేదిక తమ చేతికి చిక్కిందని చెప్పిన రిపబ్లిక్ టీవీ ఛానల్.. ఆ వివరాల్ని బయటపెట్టింది. మోడీ సర్కారుకు ఐదు వారాల క్రితం సమర్పించిన రిపోర్ట్ తమకు అందిందంటూ.. అందులోని అంశాల్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది. సదరు రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా ఆమె కుటుంబ సభ్యులకు మాల్యా వారి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో ప్రతిసారీ ఫస్ట్ క్లాస్ కేటగిరిలోనే ప్రయాణించేవారట.
ఎకానమీ టికెట్లు తీసుకున్న వారిని ఏకంగా ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెట్టేవారట. వారు కొన్న టికెట్లను సైతం ఫ్రీ కోటా కింద ఉంచేసి.. ఆ లెక్కంతా మాల్యా చూసుకుంటారని చెప్పేవారట. అంతేకాదు.. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ఉపయోగించిన హెలికాఫ్టర్ మాల్యా వారి పుణ్యమేనట. ఫరూక్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని.. ఆ మొత్తాన్ని మాల్యా చెల్లిస్తారంటూ కింగ్ ఫిషర్ కు ఆదేశాలు అందాయట. ఇలా నేతల సేవలకు.. తన వ్యక్తిగత ప్రయోజనాలకు కింగ్ ఫిషర్‌ను వాడేసిన తీరు బయటకొచ్చి ఇప్పుడు సంచలనంగా మారింది.