ఏరు దాటేదాక ఏరు మల్లన్న....ఏరు దాటాక బోడి మల్లన్న...అన్నట్లుంది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం. మొన్నటికి మొన్న తన ఫార్ములా వన్ జట్టు పేరు నుంచి ఇండియా ను తొలగించాడు. తాజాగా, ఇండియాలో మిస్ అవడానికి ఏమీ లేదంటూ వ్యాఖ్యానించి తనకు ఇండియా పట్ల ఉన్న అనాసక్తిని వ్యక్తపరిచాడు. లండన్ లో రాజభోగాలు అనుభవిస్తున్న మాల్యా ఇండియాలో ఏమీ కనిపించడం లేదని చెప్పాడు.
భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఎంచక్కా లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ మాల్యా. లండన్‌లో పరుగుపందేలు - వింబుల్డన్ - క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ సరదాగా గడిసేస్తున్నాడు. ఇండియాను మిస్సవుతున్నారా అని ఓ విలేకరి అడిగితే.. అబ్బే అసలు మిస్సవడానికి ఇండియాలో ఏమీ లేదని తేల్చేశాడు.
భారత్ లోని బ్యాంకులకు వేల కోట్లు బాకీ పడ్డ మాల్యా స్వదేశానికి రావాలని హెచ్చరించినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. మాల్యా ఒక్కసారి భారత్ వస్తే కేసులన్నీ చుట్టుముడుతాయి. అందుకే ఆయన ఇంగ్లాండ్ వదిలి రావడంలేదు. ఇటీవలే లండన్‌లో జరిగిన ఫార్ములావన్ ప్రమోషనల్ సందర్భంగా ఓ విలేకరి మాల్యాతో మాట్లాడాడు.
మీరు భారత్ ను మిస్సవుతున్నారా? అన్న ప్రశ్నకు మాల్యా స్పందించాడు. ‘అక్కడ మిస్సవడానికి ఏం లేదు. నా కుటుంసభ్యులంతా ఇంగ్లాండ్ - అమెరికాల్లో ఉన్నారు. భారత్ లో నాకంటూ ఒక్కరు కూడా లేరు. నా తోబుట్టువులు కూడా యూకే పౌరసత్వం పొందినవారే. ఇక కుటుంబపరంగా భారత్ లో మిస్సవడానికి ఏం లేదు’ అని తాపీగా చెప్పాడు. తనపై కావాలనే ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పడం కొసమెరుపు. మాల్యాను భారత్ కు రప్పించే కేసు విచారణ లండన్ కోర్టులో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాల్యాను అరెస్టు చేయగా.. బెయిల్ పై విడుదలయ్యాడు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.