లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను చూస్తుంటే ఆయన లండన్ కు పారిపోయాడా లేదంటే పర్యటనకు వెళ్లాడా ? అన్నట్లుగా ఉంది. బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలను ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన ఆయనను తిరిగి ఇండియాకు రప్పించేందుకు అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... ఆయన మాత్రం లండన్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.
నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండోపాక్ క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి దర్జాగా వచ్చారు. దాయాదుల సమరాన్ని స్టాండ్స్ లో కూర్చొని వీక్షించిన ఆయన వైపు కెమేరాలు ఫోకస్ అవుతుంటే పరారీలో ఉన్న ఓ వ్యక్తి అంత ధైర్యంగా ఎలా తిరుగుతున్నారంటూ ఇండియన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆయన్ను ఇండియాకు రప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న అధికారులకు మాల్యా చర్య పుండు మీద కారం చల్లినట్లయింది.
మ్యాచ్ చూడ్డానికి వచ్చిన మాల్యా అక్కడితో ఆగలేదు. ఇండియాలో తనకు తెలియని సెలబ్రిటీ ఎవరూ లేకపోవడంతో అక్కడ కనిపించినవారందరితో నవ్వుతూ మాట్లాడుతూ హల్ చల్ చేశారట కూడా. అయితే... అదంతా బయటకు రాకపోయినా మాజీ క్రికెటర్ సునీల్ గావాస్కర్ తో ఆయన చాలాసేపు ముచ్చటించడం మాత్రం కెమేరాలకు చిక్కింది. మాల్యా వ్యవహారశైలితో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన మాత్రం ఇండియా అయితే ఏముంది.. లండన్ అయితే ఏముంది... ఎక్కడైనా మన లైఫ్ బిందాసే అన్నట్లుగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/