ఎంపీ - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పొరపాటున పప్పు అన్న విజయ్ ప్రధాన్.. ఇప్పుడు పబ్లిగ్గానే ఆయనపై విరుచుకుపడుతున్నారు. వాట్సాప్ మెసేజ్ లో రాహుల్ ను విజయ్ పప్పు అనడంతో తన మీరట్ జిల్లా అధ్యక్ష పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు రాహుల్ కు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. తనలాగే మరికొందరు కాంగ్రెస్ బాధితులతో కలిసి పప్పు ముక్త్ (పప్పు లేని) భారత్ కోసం కృషి చేస్తానని విజయ్ ప్రధాన్ చెప్పారు.
22 ఏళ్లు పార్టీకి సేవలందించిన ప్రధాన్.. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రతిష్ట తగ్గడానికి రాహుల్ గాంధీయే కారణమని ఆయన ఆరోపించారు. `రాహుల్, ఆయన చుట్టూ ఉన్న వాళ్లు కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం ప్రయత్నిస్తున్నవారి కలలను సాకారం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. తన పొగిడిన విషయాన్ని కూడా గుర్తించని వ్యక్తి నా దృష్టిలో పప్పుయే. ఆయన్ని అలా అన్నందుకు ఏమీ చింతించడం లేదు`` అని విజయ్ స్పష్టంచేశారు. తనలాగే కాంగ్రెస్ పార్టీతో విసుగు చెందిన మరికొందరు కూడా పప్పు ముక్త్ భారత్ ప్రచారంలో నా వెంట వస్తున్నారని చెప్పారు.తాజా వేదిక ద్వారా విజయ్ ఇంకెన్ని కామెంట్లు చేస్తారో అని పలువురు చర్చించుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/