ఎన్నికలకు రెడీగా ఉండండి..: విజయసాయి రెడ్డి

Update: 2019-08-05 04:52 GMT
అక్టోబర్ 17 తేదీకి రెండు మూడు రోజులు అటూ ఇటుగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని అంటూ ఆయన ఆ ప్రకటన చేశారు.

అన్నీ కుదిరితే అక్టోబర్ పదిహేడో తేదీన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. కాస్త లేట్ అనుకుంటే ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు.

స్థానిక ఎన్నికల్లో భాగంగా ముందుగా పంచాయతీ - జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ వెంటనే మున్సిపాలిటీ - కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని విజయసాయి రెడ్డి ప్రకటించారు.

ఈ మేరకు ఎన్నికలకు రెడీగా ఉండాలని అయన అన్నారు.  స్థానిక ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు కళ్లా ముగుస్తుందని అన్నారు. అన్ని ఎన్నికలూ ఈ ఏడాది చివరకు పూర్తి అవుతాయని ప్రకటించారు.

మొత్తానికి ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఎదురుచూస్తున్న ఎన్నికల గురించి విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సింది.  అయితే తన టర్మ్ చివరలో ఈ ఎన్నికలను నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు ధైర్యం చేయలేదు. దీంతో అప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ ప్రభుత్వం రెడీగా కనిపిస్తోంది.


Tags:    

Similar News