భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం...విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా - సవివరంగా స్పందించారు. జగన్ గొప్ప నాయకుడైతే తన కంటే ఎవరూ ఎక్కువ సంతోషించరన్నారు. జగన్ పరిపాలన బాగుంటే నేను నా సినిమాలు చేసుకుంటాను అని పవన్ పేర్కొన్నారు. దీంతో పాటుగా - వైసీపీ నేత - జగన్ నమ్మిన బంటు విజయ సాయి రెడ్డి పై పవన్ మండిపడ్డారు. ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. దేశానికి సేవ చేసిన మహానుభావులనే రాజ్య సభకు పంపుతుంటారని కానీ - సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయ సాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లి కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
తన గురించి విజయ సాయి రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని - భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీలో శక్తి వంతులైన వారికి సైతం వీరి గురించి తాను చెప్పగలనని పవన్ అన్నారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయ సాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వారిలాగా ఎలా పడితే అలా మాట్లాడనని - వారు పరిధి దాటితే మాత్రం వారి తాట తీస్తామని హెచ్చరిస్తారు. వైసీపీలో ఏక స్వామ్యం మాత్రమే ఉందని - ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఒకడి ఇష్టానుసారం నడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు. ప్రధాని మోదీ నన్ను చాలా ప్రేమగా పిలిచేవారు. అయినప్పటికీ...ప్రత్యేక హోదా అనే ఆశయానికి కట్టుబడే నేను మోదీతో విభేదించాను అని తెలిపారు.
మరోవైపు వైసీపీ నేత అంబటి రాంబాబు పై సైతం పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన డీఎన్ ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉందని పేర్కొంటూ...తమాషాగా ఉందా తన డీఎన్ ఏ గురించి మాట్లాడటానికి అని పవన్ మండిపడ్డారు. మీ అమ్మాయి పెళ్లికి ఎందుకు పిలిచారని - ఏ డీఎన్ ఏ ఉందని పిలిచారని అంబటి పేరు ప్రస్తావించకుండా...పవన్ విరుచుకుపడ్డారు. భీమవరం - గాజువాకలో ఓడినంత మాత్రానా తాము విఫలమైనట్టు కాదన్న పవన్ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం కంటే పదవులు ఎక్కువ కాదన్నారు. తాను టీడీపీకి దత్తత పుత్రుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయితే - తాను ప్రజలకు తప్ప ఎవరికీ దత్తత పుత్రుడని అన్నారు. జగన్ కు రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడే దమ్ము లేకపోయిందన్నారు. తాను తెలంగాణ నడిబొడ్డున ఉద్యమం గురించి మాట్లాడా కాబట్టే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు తనను నమ్మారని పవన్ తెలిపారు.