టీవీ 9 సీఈఓ పదవి నుంచి దాదాపుగా మెడపట్టి గెంటేయించుకున్న రవిప్రకాశ్ ఇప్పుడు నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. మొన్న ఉదయం నుంచి రవిప్రకాశ్ పై వార్తలు వెలువడగా... సాయంత్రానికే టీవీ 9 తెరపై ప్రత్యక్షమైపోయిన రవిప్రకాశ్... తాను ఎక్కడికి పారిపోలేదని, ఆ అవసరం కూడా తనకు రాలేదని, ఇకపై రాబోదని కూడా కాస్తంత గట్టిగానే చెప్పుకున్నారు. అయితే ఆ మరునాటికే తన పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమైపోయింది. అయితే పోలీసు విచారణకు మరో రోజు గడువు ఉంది కదా అని శుక్రవారం ఉదయం దాకా హైదరాబాద్ లోనే ఉన్న రవి ప్రకాశ్... మధ్యాహ్నం తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయారు. అంటే పరారీలో ఉన్నట్లే కదా. అంటే... తాను ఖండించిన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టే కదా.
ఈ వివాదం నేపథ్యంలో ఇప్పటికే రవిప్రకాశ్ పై తనదైన శైలిలో కడిగిపారేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి... ఈ సారి మరింతగా రవిప్రకాశ్ ను దునుమాడేశారు. రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయాన్ని తెలియపరుస్తూనే... రవిప్రకాశ్ పై తనదైన శైలి సెటైర్లు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన సాయిరెడ్డి... రవిప్రకాశ్ తీరును ఎండగడుతూ తనదైన శైలి పంచ్ లు సంధించారు.
ఆ ట్వీట్ లో విజయసాయిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... *మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3గంటల నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే ఈ నెల 23వ తేదీ తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?* అంటూ రవిప్రకాశ్ ను ఓ రేంజిలో ఏసుకున్నారు.