తరచూ తన ట్విట్టర్ ఖాతాతో టీడీపీ అధినేత చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ఖాతాను వేదికగా తీసుకొని బాబును ఏకిపారేశారు.
ఇటీవల టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరటం.. వారి విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఒప్పుకోవటం తెలిసిందే. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా బాబుకు అత్యంత సన్నిహితుడిగా సుపరిచితమైన సుజనా చౌదరి.. సీఎం రమేష్ లు బీజేపీలో చేరటంపై విస్మయం వ్యక్తమైంది.
బాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలు.. ముగ్గురు తాజాగా బీజేపీలోకి వెళ్లటంపై ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. బాబుకు తెలిసే తన పార్టీ నేతల విలీనాలు జరిగి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వాదనకు బలం చేకూరేలా విజయసాయి ట్వీట్ వ్యాఖ్యలు ఉండటం ఆసక్తిరంగా మారుతున్నాయి.
బాబు తీరును ప్రస్తావస్తూ.. రాజ్యసభలో టీడీపీ నుంచి బీజేపీలోచేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గరు చంద్రబాబుకు బినామీలుగా ఆరోపించారు. అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమ ఆయన పార్టీ మారినట్లుగా ఎద్దేవా చేశారు. పక్కాగా ఇదంతా చంద్రబాఉ స్కెచ్ గా విజయసాయి అనుమానిస్తున్నారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ.. ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యల చేశారు. బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు బాబుతో సన్నిహిత సంబంధాలుఉన్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం మొత్తం మ్యాచ్ ఫిక్సింగేనని చెబుతున్నారు. ఒకవేళ తనకు తెలీకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పక్షంలో ఇప్పటికే వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ రాసేవారు కదా? అని విజయసాయి ప్రశ్నించారు.
తాజాగా విజయసాయి ట్వీట్లను చూస్తే..
+ బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే.
+ చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసింది. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసు.
+ సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసింది. 45 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే లేదు.