ఆంధ్రా ఆక్టోప‌స్ కాదు.. ఎల్లో జ‌ల‌గ‌!

Update: 2019-05-19 04:59 GMT
విభ‌జ‌న కానీ జ‌రిగితే రాజ‌కీయాల్లో ఉండ‌న‌ని శ‌ప‌ధం చేసిన ల‌గ‌డపాటి.. మాట మీద నిల‌బ‌డిన‌ట్లుగా చెబుతూ రాజ‌కీయాల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్లుగా క‌ల‌ర్ ఇవ్వ‌టం తెలిసిందే. రాజ‌కీయాల్ని వ‌దిలేసిన‌ప్పుడు.. వాటికి దూరంగా ఉండాలి. కానీ.. స‌ర్వేలంటూ ఎవ‌రు గెలుస్తారో చెప్పే షోను త‌ర‌చూ నిర్వ‌హిస్తుంటారు. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌లో.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మి గెలుస్తుంద‌న్న మాట‌ను మాగొప్ప‌గా చెప్ప‌టం.. స‌ర్వేల్లో త‌నంత పోటుగాడు ఎవ‌డూ ఉండ‌రంటూ బిల్డ‌ప్ ఇచ్చే ఆయ‌నగారి అంచ‌నాలు ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాయో తెలిసిందే.

తాజాగా మ‌రోసారి ఆయ‌న త‌న స‌ర్వే వివ‌రాల్ని వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ ధ‌నిక రాష్ట్రం కావ‌టంతో కారును అక్కున చేర్చుకున్నార‌ని.. ఆంధ్రా ఆర్థికంగా పేద రాష్ట్రం కావ‌టంతో సైకిల్ ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న‌ట్లుగా చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.

బాబు స్కెచ్ లో భాగంగానే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేను విడుద‌ల చేశార‌న్నారు. ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే ల‌గ‌డ‌పాటి చేత బాబు గెలుస్తున్న‌ట్లుగా చెప్పుకొని.. కౌంటింగ్ మొద‌ల‌య్యాక ఎదుర‌య్యే ఓట‌మిని.. ఈవీఎంల ట్యాంప‌రింగ్ కార‌ణ‌మ‌ని చెప్పేందుకే ఈ ప్ర‌య‌త్న‌మంతా అని వ్యాఖ్యానించారు.

ల‌గ‌డ‌పాటి ఆంధ్రా ఆక్టోప‌స్ కాదని ఎల్లో జ‌ల‌గ‌గా అభివ‌ర్ణించారు. ల‌గ‌డ‌పాటిగారూ.. మీ పేరును నారా రాజ‌గోపాల్ గా మార్చుకోవాలంటూ ఆయ‌న ట్వీట్ లో సూచించారు.

మ‌రో ట్వీట్ లో ఆయ‌న ర‌విప్ర‌కాశ్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ర‌క్షించ‌క‌పోతే బాబు ర‌హ‌స్యాల‌న్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని మీడియా న‌యిం ర‌విప్ర‌కాశ్ బ్లాక్ మొయిలింగ్ కు దిగారన్నారు.  ఏదో ఒక‌టి చేసి ర‌క్షించ‌క‌పోతే బాబు సీక్రెట్స్ అన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని బ్లాక్ మొయిల్ కు దిగార‌ట మీడియా న‌యిం అని పేర్కొన్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యే  23 త‌ర్వాత త‌న ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యంపై అంతుబ‌ట్ట‌క ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. తాజాగా ర‌విప్ర‌కాశ్‌.. శివాజీ.. అశోక్.. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చౌద‌రిల బెదిరింపుల‌తో బాబు కుంగిపోతున్న‌ట్లుగా పేర్కొన్నారు. వీళ్లంద‌రికి తానింత ఈజీగా దొరికిపోయానేంట‌ని మొత్తుకుంటున్నాడ‌ట అంటూ ఎద్దేవా చేశారు.

చంద్ర‌గిరి రీపోలింగ్ మీద ట్వీట్ చేసిన విజ‌య‌సాయి రెడ్డి .. బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. చంద్ర‌గిరిలో ఏడు పోలింగ్ బూత్ ల‌లో రీపోలింగ్ అంటే ఇంత‌గా వ‌ణికిపోతున్నారేంటి బాబు? ఈసీపై దాడికి పుర‌మాయించేంత త‌ప్పేం జ‌రిగింద‌ని? అని ప్ర‌శ్నించారు. ఏ పార్టీ ఓట‌ర్లు ఆ పార్టీకి ఓటేస్తార‌ని.. అంత‌మాత్రానికే ఓడిపోయిన‌ట్లు గంగ‌వెర్రులెందుకు? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. పాతికేళ్లుగా ద‌ళితులకు ఓటుహ‌క్కు దూరం చేసిన మీ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డినందుకా? అంటూ ట్వీట్ ఫైర్ అయ్యారు. ఏ విష‌యంలోనూ వ‌దిలిపెట్ట‌క బాబును ట్వీట్స్ తో టార్గెట్ చేస్తున్న విజ‌య‌సాయి రెడ్డి  తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


Tags:    

Similar News