బాబుకు హ్యాండు...వైసీపీ ఎంపీకి షేక్ హ్యాండ్

Update: 2017-12-31 04:18 GMT
మొగుడు కొట్టినందుకు కంటే తోడికోడలు నవ్వినందుకు బాధ ఎక్కువని ఒక సామెత ఉంది... ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అచ్చంగా అలాగే ఉంది. పాపం.. చంద్రబాబు చాలాకాలంగా మిత్రపక్షం బీజేపీ నేత - ప్రధాని మోదీ అపాయింటుమెంటు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు. కానీ.. ఆయనకు అపాయింటుమెంటు ఇవ్వని మోదీ ఏపీ విపక్ష నేతలతో మాత్రం బ్రహ్మాండంగా భేటీ అవుతున్నారు. దీంతో చంద్రబాబుకు ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉందట.
    
జాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మోదీతో 15 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల టైంలో వివిధ పార్టీల ఎంపీలు ప్రధానిని మర్యాదపూర్వకంగా పలకరించడం గొప్ప విషయమేమీ కాదు కానీ, ఇక్కడ జరిగింది అలాంటి పలకరింపు కాదు. ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చ జరిగింది. అంతేకాదు... మోదీ స్వయంగా జగన్ పాదయాత్ర గురించి విజయసాయిని అడిగి వివరాలు తెలుసుకున్నారట.
    
పనిలో పనిగా విజయసాయి కూడా ఏపీ ప్రభుత్వంపైనా - చంద్రబాబుపైనా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.  పోలవరం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో పాటు.. ఏపీకి ప్రత్యేక హోదా - విశాఖ రైల్వే జోన్ - విభజన హామీల అమలు - రాజధాని నిర్మాణం వంటి విషయాలను ఆయన వద్ద మాట్లాడారట.
    
దీంతో మోదీ తనను ఏమాత్రం పట్టించుకోకుండా విపక్ష నేతలకు ప్రయారిటీ ఇస్తుండడంతో ఇక్కడ చంద్రబాబు రగిలిపోతున్నట్లు సమాచారం. మరి, ఈ వేడి ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News