ఏపీ సీఎం జగన్ తన కొత్త కేబినెట్ ను దాదాపుగా నిర్ణయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ శాసనసభా పక్షం సమావేశాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి సారే 25మందికి అవకాశం కల్పిస్తామని.. ఆ తర్వాత రెండున్నరేళ్లకు మరికొంత మందిని మంత్రులుగా తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు.. అందరికీ అవకాశం ఇస్తామని.. కీలకమైన పదవులు కట్టబెడుతామని జగన్ పేర్కొన్నారు.
కాగా జగన్ తన కేబినెట్ లో చోటు ఖాయం అనుకున్న వారికి ఫోన్లు చేయిస్తున్నారని సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా కాబోయే మంత్రులకు ఫోన్ చేసి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని చెబుతున్నారు.
తాజాగా సీనియర్ పొలిటీషియన్స్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు బొత్స - సుచిరిత - పెద్దిరెడ్డి - గౌతమ్ రెడ్డిలకు ఇప్పటికే విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.
ఇక స్పీకర్ గా తమ్మినేని సీతారాంను జగన్ ఖాయం చేశారు. ఈ పదవి ఎమ్మెల్యే రోజాకు వరిస్తుందని ప్రచారం జరిగినా తమ్మినేని ఖాయం కావడంతో ఆమెకు మంత్రి పదవిపై ఆశలు చిగురించాయి. ప్రస్తుతానికి నలుగురు మంత్రులు ఏపీ కేబినెట్ లో ఖాయం అయ్యారు. ఈ సాయంత్రానికి పూర్తిగా 25మంది కేబినెట్ మంత్రుల లిస్ట్ బయటకు రానుంది.