బాబు, ఆర్కేలకు దానితోనే వైసీపీ సమాధానం

Update: 2019-04-08 04:32 GMT
టిట్ ఫర్ టాట్.. ఏవో ఆడియోలు బయటకు తీసి.. ఏదేదో కుట్ర చేసి ఎన్నికలకు మూడు నాలుగు రోజుల ముందు ఏపీ ప్రజలను గందరగోళ పరిచి ఓట్లు దండుకోవడానికి పచ్చమీడియా , చంద్రబాబు పన్నిన కుట్రలకు వైసీపీ చెక్ పెట్టింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో అంటూ టీడీపీ అనుకూల చానెల్ లో వండివర్చాన కథనంపై వైసీపీ చట్టపరంగా పోరాడేందుకు నిర్ణయించింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఆడియో తనది కాదంటూ మార్ఫింగ్ చేశారంటూ తాజాగా తెలంగాణలోని జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. దీనిపై తెలంగాణ పోలీసులు  ప్రసారం చేసిన ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, వెనుకున్న సీఎం చంద్రబాబుపై కేసులు నమోదు చేయడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.

మీడియా, అధికార దర్పంతో చెలరేగిపోతున్న టీడీపీ, దాని అనుకూల మీడియాకు తెలుగు రాష్ట్రాల్లో పట్టపగ్గాలు లేకుండా పోతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవాలు నిర్ధారించకుండా.. మాట్లాడిన వారి బైట్ తీసుకోకుండా వైసీపీని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా మీడియాలో చెలరేగిపోతున్న టీడీపీ అనుకూల మీడియాను చట్టం, న్యాయ పరంగా ఎదుర్కోవడానికి వైసీపీ రెడీ కావడంతో టీడీపీ శిబిరంలో గుబులు మొదలైంది..

ఇప్పటికే ఏపీ ప్రజల డేటా చోరీ విషయంలో తెలంగాణ పోలీసులు టీడీపీ నేతల మూలాలను వెతికి తీసే పనిలో బిజీగా ఉన్నారు. దానికే పెద్ద గగ్గోలు పెట్టిన టీడీపీకి ఇప్పుడు వైసీపీ పెట్టిన ఆడియో టేపుల కేసు కూడా ఇరుకునపెడుతోంది.. విచ్చలవిడిగా పార్టీలపై పడిపోయే పచ్చమీడియాకు కేసులతోనే చెక్ పెట్టాలని వైసీపీ నిర్ణయించడం.. అంతే ఫాస్ట్ గా రియాక్ట్ కావడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.   

    

Tags:    

Similar News