పంచ్ లు పేల్చే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీరు వేరుగా ఉంటుంది. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే.. విషయాన్ని ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తుంటారు. విడి మాటల్లో ఎలా ఉన్నా.. ఆయన పోస్ట్ చేసే ట్వీట్లు మాత్రం స్పైసీగా ఉండటమే కాదు.. ప్రత్యర్థులకు షాకుల మీద షాకులు ఇచ్చేలా ఉంటాయి.
నెటిజన్ల మనసుల్ని దోచేలా ఉండే ట్వీట్లు.. తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యమైన విషయాల మీద ట్వీట్లతో తన అభిప్రాయాన్ని షేర్ చేసే విజయసాయి.. తాజాగా తన మీద రూ.100 కోట్ల పరువునష్టం వేస్తానంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తరఫున ఆయన మేనేజర్ (పేరు వెల్లడించలేదు) ఒకరు మీడియాకు నోట్ పంపటం తెలిసిందే.
దీనిపై స్పందించిన విజయసాయి.. దిమ్మ తిరిగే ట్వీట్ పంచ్ ను పోస్ట్ చేశారు. రవిప్రకాశ్ పేరును ప్రస్తావించకుండా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వంద కోట్ల పరువు నష్టం ఏంటి? వెయ్యి కోట్లు వేసుకో అంటూ తేల్చేసిన ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మీడియాను అడ్డం పెట్టుకొని పదిహేనేళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయిం. చంద్రబాబు అండ చూసుకొని ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేశాడు. ఇప్పుడు తనే పెద్ద బ్రేకింగ్ న్యూసై పోయాడు. వంద కోట్లు ఏం ఖర్మ వెయ్యి కోట్లకు వేసుకో ‘పరువు’ నష్టం దావా అంటూ తేల్చేశారు. పరువు నష్టం దగ్గర.. పరువును నొక్కి పలికినట్లుగా కోట్స్ పెట్టటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. వంద కోట్ల పరువునష్టం దావా విషయంలో ఏమాత్రం భయపడటం లేదని.. మీకు చేతనైంది.. చేతనైనట్లుగా చేసుకో సుమా.. అని తేల్చి చెప్పినట్లుగా ట్వీట్ ఉందని చెప్పాలి.