ప్రత్యర్థిపై ట్వీట్ల దాడి చేసేటప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా విరుచుకుపడే తత్త్వం కొందరికి మాత్రమే సొంతం. అలాంటి ట్వీట్ల దాడిలో మొనగాడిగా చెప్పాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. ఏ చిన్న అవకాశం వచ్చినా బాబును ట్వీట్లతో చీల్చి చెండాడే ఆయన.. ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మెజార్టీ సంస్థలు జగన్ గెలుపు ఖాయమని చెప్పగా.. లగడపాటి రాజగోపాల్ మాత్రం అందుకు భిన్నంగా చంద్రబాబు గెలుస్తారన్న మాటపైన విజయసాయి ఎటకారంగా స్పందించారు. రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్ ఏ డామినేట్ చేసిదంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. తాజాగా రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జైట్ అయిన తెలుగు తమ్ముళ్లు ఈ నెల 23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేటట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ అడగొచ్చు.. తప్పు లేదన్న విజయసాయి రెడ్డి.. 23 తర్వాత చంద్రబాబు.. కిరసనాయులు ఫోన్లు కూడా ఎత్తరన్నారు.
తాజాగా ఢిల్లీలో అదే పనిగా పలు రాజకీయ పార్టీలను కలిసి.. మోడీ ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు.. ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ శరాఘాతంగా మారాయని చెప్పాలి. ఈ ఫలితాల తర్వాత నుంచి ఢిల్లీలో విపక్షాలు కామ్ గా ఉండటమే కాదు.. ముందుగా డిసైడ్ అయిన అపాయింట్లు సైతం రద్దు చేసుకొని ఎవరికి వారు గప్ చుప్ సాంబార్ బుడ్డీ అన్న చందంగా ఉండిపోతున్న పరిస్థితి.
ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. అవసరం ఉన్నా లేకున్నా పలువురు నేతలతో భేటీ అవుతూ.. హడావుడి చేస్తున్న తీరుపై వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. ఢిల్లీలో చంద్రబాబు పేరును ఫెవికాల్ బాబాగా పిలుస్తున్నారని పేర్కొన్నారు. పిలవని పేరంటానికి వెళ్లిన చందంగా పలువురు నేతల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు.. వారితో ఫోటోలు దిగేందుకు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారన్నారు. బాబు ఢిల్లీ టూరుపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పంచ్ ల్ని చూస్తే...
+ ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట.
+ యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు.
+
ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట.
+ లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు .
+ పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు చేస్తున్నదేమిటో? తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడి పోవాలో ఈయన కంటే వాళ్లకు బాగా తెలుసు.
+ ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు? ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత కూడా నీతిమాలిన పనులకు తెగబడ్డావు.