ఆయన పుట్టింది పెరిగింది ఎదిగింది అంతా నెల్లూరు జిల్లాలోనే కానీ ఆరేళ్ల విశాఖవాసం ఆయనకు గట్టి బంధాన్ని పెంచేశాయా అంటే అవును అనే చెప్పాలేమో. విశాఖకు తరచూ విజయసాయిరెడ్డి వస్తున్నాయి. ఆయనకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి మార్చి కీలకమైన బాధ్యతలు ఎన్నో జగన్ అప్పగించారు. అయినా సరే విశాఖ వైసీపీ నాయకులు ఆయనకు కలవకమానరు. ఆయన కూడా విశాఖ ప్రస్థావన తేకుండా అసలు ఉండలేరు.
ఇవన్నీ పక్కన పెడితే విశాఖ రాజధాని ఎపుడూ అంటే మాత్రం వైసీపీ మొత్తానికి జవాబు చెప్పగలిగేది ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే అంటే ఆశ్చర్యం కానీ అతిశయోక్తి కానీ లేదు. ఆయన లేటెస్ట్ గా విశాఖ టూర్ చేశారు. ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈసారి ఆయన రావడం వెనక ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన వరసగా రెండవమారు రాజ్యసభ ఎంపీగా నెగ్గారు.
దాంతో ఆ హుషార్ అంతా ఆయన ముఖంలో కనిపించింది. అంతే కాదు విశాఖ రావడంతోనే సొంత ఇంటికి వచ్చిన ఫీల్ కూడా ఆయనకు కలిగినట్లు ఉంది. మీడియా కనబడగానే ఒక ప్రశ్నకు పది జవాబులు ఆయన ఇచ్చేశారు. అన్నీ చెప్పేసిన ఆయన విశాఖ రాజధాని విషయంలో మాట్లాడకుండా ఉంటారా. హరిహరాదులు అడ్డుపడినా ఆఖరుకు చంద్రబాబు అడ్డం పడినా విశాఖకు రాజధాని వచ్చి తీరుతుంది అని చాలా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు.
దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అవి కనుక పరిష్కారం అయితే మాత్రం విశాఖ రాజధాని అయి తీరుతుంది అని ఆయన ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఈ మధ్యనే విశాఖకు రాజధాని అవసరం లేదు అభివృద్ధి చాలు అని చంద్రబాబు జిల్లా టూర్లు పదే పదే చెప్పారు. దానికి కౌంటర్లు వెయడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోలేదు. ఆ మధ్య హై కోర్టు తీర్పు ఇచ్చేశాక సుప్రీం కోర్టుకు అప్పీల్ కి వెళ్ళకుండా ప్రభుత్వం రాజధాని మీద ఏదీ అనలేని స్థితి ఉంది.
అందుకే విజయసాయిరెడ్డి పాము విరగకుండా కర్ర చావకుండా విశాఖ రాజధాని గురించి చెప్పేశారు. అలాగే రాజధాని కోరుకునే వారి ఆశ చావకుండా కూడా అలా ఉంచారు. మరి ఎపుడు విశాఖ రాజధాని అవుతుంది. ఎంతెంత దూరం ఆ రాజధాని ఉంది అంటే దానికి విజయసాయిరెడ్డి కూడా ఏమీ చెప్పలేరు. అయితే విశాఖ రాజధాని ముచ్చటకు ఎపుడు ఎండ్ అంటే అది మాత్రం అది ఎవరైనా చెప్పగలరేమో.
ఇక 2024 ఎన్నికల దాకా ఈ ముచ్చట ఆలా సాగుతూనే ఉంటుంది. ఆ ఎన్నికలే దీనికి ఒక పరిష్కారం చూపించాలి అన్న మాట. అంతవరకూ విశాఖ రాజధాని ఈ రెండూ అలా కుడి ఎడమల్లా ఉంటాయి. వాటిని అపుడపుడూ విజయసాయిరెడ్డి కలుపుతూ కిక్కించినా వాటికి అంతులేని లెక్కలు ఉన్నాయి. అందుకే ఏ మాట అయినా విజయసాయిరెడ్డి చెబితేనే వైసీపీ నేతలకు హుషార్ గా ఉంటుందేమో.