విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కనిపించిన విజయశాంతి.. ఆ తర్వాత అదృశ్యం కావటం తెలిసిందే. దాదాపుగా 13 నెలల తర్వాత ఆమె ఒక్కసారి తెర మీదకు వచ్చారు. రావటం.. రావటంతోనే పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నారు.
సెక్షన్ 8 అమలుకు సంబంధించి జరుగుతున్న అంశాల నేపథ్యంలో విజయశాంతి ఒక్కసారి తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ కనిపించని విజయశాంతి వ్యవహారం.. ఉలిక్కిపడి నిద్ర లేచినట్లుగా ఉంది. ఇంతకాలం జరిగిన ఏ విషయానికి స్పందించని ఆమె.. విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలుకు సంబంధించి వ్యవహారం అటార్నీ జనరల్ నోటి మాటగా వచ్చిందన్న వెంటనే ఆమె రియాక్ట్ అయిపోయారు.
సెక్షన్ 8 అమలు చేయట అంటే.. ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టటమేనని పేర్కొన్నారు. ఒకవేళ సెక్షన్ 8ను అమలు చేయాలని చూస్తే.. మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సెక్షన్ 8 అమలు అయితే ఉద్యమం అంటున్న విజయశాంతి.. ఇన్ని రోజులుగా ఎక్కడున్నారు? ఏం చేసినట్లు..?