రాజకీయాలకు దూరంగా ఉన్న తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? ఆయన తర్వలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారా? అంటూ ఇప్పుడు తమిళనాడులో చర్చ సాగుతోంది. సూపర్ స్టార్ల జీవితాలు రాజకీయాలతో పెనవేసుకున్న తమిళనాడులో సుదీర్ఘ రాజకీయ పరిణామాలను కలిగి ఉండే ఎత్తుగడలో ఉండే దళపతి విజయ్ కి అనూహ్యమైన ఒక అవకాశం దక్కింది. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి SSLC - HSC పరీక్షలలో ముగ్గురు టాప్ ర్యాంక్ హోల్డర్లను సత్కరించే అవకాశం దక్కింది.
చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో టాపర్లు వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు వారి స్వస్థలాల నుండి చెన్నైకి చేరుకోవడానికి విజయ్ అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయ్యకం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు- తల్లిదండ్రులతో విజయ్ మాట్లాడుతూ.. డబ్బులు తీసుకుని ఓటు వేయవద్దని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు రూ.15 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వెచ్చించిన మొత్తాన్ని ఎలా భర్తీ చేస్తారని అవినీతి ఎలా మొదలవుతోందో తెలుసుకోవాలని అన్నారు.
విద్యార్థులు బాగా చదువుకోవాలని వారి ఇష్టానుసారం రెక్కలు విప్పుకోవాలని చెప్పారు. విజయ్ తన అభిమానుల సంఘంతో మే 28 ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ నెమ్మదిగా కానీ క్రమంగా సామాజిక జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. 234 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని సన్మానించడానికే విజయ్ ఇష్టపడటం సూపర్ స్టార్ తమిళనాడులో సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌పై దృష్టి సారించడానికి స్పష్టమైన సూచిక.
విజయ్ మక్కల్ ఇయ్యకం వర్గాలు IANSతో మాట్లాడుతూ- సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చే ముందు మేధావుల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి పలువురు రిటైర్డ్ బ్యూరోక్రాట్ లు జర్నలిస్టులు సినీ తారలతో టచ్ లో ఉన్నారు. విజయ్ ఇంతకుముందు రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించాడు. అయితే రజనీకాంత్ ఎన్నికల దృష్టాంతంలోకి వచ్చే అవకాశం విజయ్ ఆశయాలకు బ్రేక్ వేసింది. కానీ ఇప్పుడు అతను మళ్ళీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడు.
తమిళనాడులో రాజకీయాలు సినిమా ఎప్పటి నుంచో పెనవేసుకుని ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు సి.ఎన్. అన్నురాయ్- ఎం. కరుణానిధి- ఎంజీఆర్- జయలలిత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని రాజకీయ నేతలు అయ్యారు. రజనీకాంత్ - కమల్ హాసన్ సినిమాలు చేసుకునేందుకు ఉత్సాహంగా ఉన్న ఈ సమయంలో దళపతి విజయ్ రాజకీయాల్లోకి దిగిపోవాలని యోచిస్తున్నాడని అంతా భావిస్తున్నారు. దళపతి ఎంట్రీకి ఇదే సరైన సమయమా? అన్నది వేచి చూడాలి. అతడు నటిస్తున్న లియో అత్యంత భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ నటిస్తున్న భారీ సినిమాల రిలీజ్ లకు ప్రత్యర్థుల రూపంలో ఏదో ఒక సందర్భంలో అడ్డంకులు తప్పడం లేదు. అధికారం గుప్పిట పట్టినవారిదే ఈ రంగంలో హవా. అందువల్ల చాలా కాలంగా విజయ్ రాజకీయాల్లో దుమ్ము దులపాలన్న పట్టుదలతో ఉన్నాడు.